సెంట్రల్ విస్టా నిర్మాణ పనులు ఆపాలన్న పిల్ తిరస్కరణ.. పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా
Central Vista project: కొవిడ్ పాండమిక్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ఇందులో ప్రజా ప్రయోజనం లేదంటూ పిటిషనర్‌పై ఆగ్రహం హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
కొవిడ్ పాండమిక్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(Central Vista Project) నిర్మాణ పనులు ఆపాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ఇందులో ప్రజా ప్రయోజనం లేదంటూ పిటిషనర్‌పై ఆగ్రహం హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్‌కు రూ.1,00,000 జరిమానా విధించింది. కరోనా పాండవిక్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కొనసాగించడం సరికాదని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సొహైల్ హాస్మి, అన్యా మల్హోత్రా తమ పిల్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విస్టా ప్రాజెక్టును కొనసాగించకుండా హైకోర్టు ఆదేశాలివ్వాలని తమ పిటిషన్ లో కోరారు. ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని..తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేయడం ద్వారా వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.
అయితే ప్రాజెక్టు పనులకు విఘాతం కలిగించేందుకు దురుద్దేశంతో ఈ పిల్ దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతున్న షపూర్జి పల్లోంజి కంపెనీ కూడా పిల్‌ను వ్యతిరేకించింది. కార్మికులు కొవిడ్ బారినపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్..మే 17న తీర్పును రిజర్వ్ చేసింది.
ఇరుతరపు వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ పిల్‌లో ప్రజా ప్రయోజనాలు లేవని పేర్కొంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశానికి అవసరమైన ప్రాజెక్టుగా పేర్కొన్న …పిటిషనర్ ఈ పిల్‌ను దురుద్దేశంతో కోర్టులో దాఖలు చేసినట్లు మండిపడింది.
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవంతితో పాటు దేశ ప్రధాని, దేశ ఉప రాష్ట్రపతి నివాస సముదాయాలను నిర్మిస్తున్నారు. అలాగే పలు మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో కూడిన సెంట్రల్ సెక్రటేరియట్ భవంతిని నిర్మించనున్నారు.
ఇవి కూడా చదవండి…
ఆనందయ్య నాటు మందుపై హైకోర్టు విచారణ.. కీలక కామెంట్స్ చేసిన న్యాయస్థానం
ఏపీలో మరో రెండు వారాలుకర్ఫ్యూ పొడిగింపు..? మరికాసేపట్లో సీఎం జగన్ ప్రకటన..!