Lockdown in AP: ఏపీలో మరో రెండు వారాలుకర్ఫ్యూ పొడిగింపు..? మరికాసేపట్లో సీఎం జగన్ ప్రకటన..!
Lockdown: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రస్తుతం పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది. కఠినంగా పగటి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే..
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రస్తుతం పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది. కఠినంగా పగటి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. నేటితో ముగుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై కఠినంగానే ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరో పది రోజులు పాటు కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు.. కట్టడికి తీసుకుంటున్న చర్యలు.. ఇస్తున్న ఫలితాలపై నేడు సీఎం జగన్ సమీక్షించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన తరువాత అధికారికంగా దీనిపై సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చేందుకు అనుమతి ఉంది. కానీ ఈ నిబంధనలు మరో రెండు గంటల పాటు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటల వరకే అత్యవసరాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉదయం పది గంటల వరకే షాపులు తెరుస్తున్నారు.