Corona Third Wave: వణికిస్తున్న థర్డ్‌వేవ్‌.. ఆ జిల్లాలో 8 వేల మంది చిన్నారులకు కోవిడ్‌.. పిల్లలనే టార్గెట్..!

Third Wave Of Corona: కరోనా థర్డ్‌వేవ్‌లో కరోనా చిన్నారులను టార్గెట్‌ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్రాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాయి...

Corona Third Wave: వణికిస్తున్న థర్డ్‌వేవ్‌.. ఆ జిల్లాలో 8 వేల మంది చిన్నారులకు కోవిడ్‌.. పిల్లలనే టార్గెట్..!
Follow us
Subhash Goud

|

Updated on: May 31, 2021 | 12:11 PM

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్‌లో కరోనా చిన్నారులను టార్గెట్‌ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్రాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది. దేశంలో కోవిడ్‌ వైరస్‌కు అధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రను థర్డ్‌వేవ్‌ వణికిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ న‌గ‌ర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్‌ సోకింది. దీంతో వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఐదుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.

థర్డ్‌వేవ్‌ గురించి స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. మే నెల‌లో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని, థర్డ్‌వేవ్‌ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ వాతావ‌ర‌ణాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని, అందుకే థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని’ అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది

India Corona: భారత్‌తో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. రికవరీ శాతం ఎక్కువ.. తాజాగా ఎన్ని కేసులంటే..!