ఆ వ్యాక్సిన్ తీసుకున్నా..కానీ యాంటీ బాడీలు ఏవీ ?…సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాపై యూపీ వాసి కేసు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనలో యాంటీబాడీలు డెవలప్ కాలేదని అంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి సీరం ఇన్స్ టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలాపైన, మరికొందరిపైనా కేసు పెట్టారు...

ఆ వ్యాక్సిన్ తీసుకున్నా..కానీ  యాంటీ బాడీలు ఏవీ ?...సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాపై యూపీ వాసి కేసు
No Antibodies Developed
Follow us

| Edited By: Phani CH

Updated on: May 31, 2021 | 1:31 PM

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనలో యాంటీబాడీలు డెవలప్ కాలేదని అంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి సీరం ఇన్స్ టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలాపైన, మరికొందరిపైనా కేసు పెట్టారు. ఈ మేరకు లక్నోలోని ఆషియానా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రతాప చంద్ర అనే ఈ వ్యక్తి తన కంప్లయింట్ లో…డీజీసీఏ డైరెక్టర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయ్ తదితరుల పేర్లను కూడా ప్రస్తావించాడు. ఏప్రిల్ 8 న తాను మొదటి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నానని, మళ్ళీ 28 రోజుల తరువాత రెండో డోసు తీసుకోవలసి ఉండగా విరామ కాలాన్ని మొదట 6 వారాలకు, తరువాత 12 వారాలకు పెంచారని అన్నాడు. తొలి డోసు తీసుకున్న అనంతరం శరీరంలో యాంటీ బాడీలు డెవలప్ అవుతాయని బలరాం భార్గవ మీడియా సమావేశంలో చెప్పారని, ఆమేరకు తాను ఓ ల్యాబ్ లో యాంటీ బాడీ జీటీ టెస్ట్ తీసుకున్నానని పేర్కొన్నాడు. కానీ తనలో ఎలాంటి యాంటీ బాడీలు డెవలప్ కాకపోగా ప్లేట్ లెట్లు 3 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గిపోయినట్టు ఆ రిపోర్టు ద్వారా తెలిసిందని అన్నాడు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నానన్నాడు.

అయితే ఇతని ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.తదుపరి చర్య తీసుకునే ముందు ఉన్నతాధికారులను సంప్రదిస్తామని వారు చెప్పారు. కానీ వీరు ఎఫ్ ఐ ఆర్ పెట్టకపోతే తాను కోర్టుకెక్కుతానని ప్రతాపచంద్ర హెచ్చరించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: VIRAL VIDEO : క్యారమ్ ఆడుతూ గొడవపడ్డ ఇద్దరు వృద్ధులు..! ఏమైందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా.. 14 వైద్య కళాశాలల పనులకు సీఎం జ‌గ‌న్ శంకుస్థాపన

CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్