CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా.. 14 వైద్య కళాశాలల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు నిర్మించాలని....
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురంలో ఏర్పాటు చేయనున్నారు. వాటితో పాటు పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్నారు. సోమవారం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని… రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ఆయన సృష్టం చేశారు.
వైద్య కళాశాలల కోసం 8 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. sపేదరికం కారణంగా వైద్యం అందని వారున్నారన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి సరైన వైద్యం అందాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి పార్లమెంటుకు ఒకటి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: ఆనందయ్య నాటు మందుపై హైకోర్టు విచారణ.. కీలక కామెంట్స్ చేసిన న్యాయస్థానం