Delhi High Court: శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిందే.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ హైకోర్టు జీవిత భాగస్వామి రిలేషన్‌షిప్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా.. శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని పేర్కొంది. వివాహం జరిగిన తర్వాత కేవలం 35 రోజుల పాటు కలిసున్న ఓ దంపతుల మధ్య వివాహ సంబంధం పరిపూర్ణం కాకపోవడం వల్ల వాళ్లకు ఫ్యామిలీ కోర్టు చివరికి విడాకులను మంజూరు చేసేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. వాస్తవానికి ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే.

ఢిల్లీ హైకోర్టు జీవిత భాగస్వామి రిలేషన్‌షిప్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా.. శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని పేర్కొంది. వివాహం జరిగిన తర్వాత కేవలం 35 రోజుల పాటు కలిసున్న ఓ దంపతుల మధ్య వివాహ సంబంధం పరిపూర్ణం కాకపోవడం వల్ల వాళ్లకు ఫ్యామిలీ కోర్టు చివరికి విడాకులను మంజూరు చేసేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. వాస్తవానికి ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ జంట 2004లో పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక చివరికి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను సవాల్ చేస్తూ.. ఆ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇప్పుడు తాజాగా దీనిపై తీర్పునిచ్చింది. వాస్తవానికి శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిందేనని వ్యాఖ్యానించింది. శారీరక బంధంలో నిరాశకు మించినటువంటి దారుణం వివాహ జీవితంలో మరొకటి ఉండదని తెలిపింది. అలాగే ప్రస్తుత కేసులో కూడా భార్య శృంగారానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో… ఆ జంట మధ్య వివాహ బంధం పరిపూర్ణం కాలేదని న్యాయస్థానం గుర్తించింది. అంతేకాదు.. ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండానే వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అసలు ఎటువంటి ఆధారాలు, కారణాలు లేకుండా.. ఇలా ఉద్దేశపూర్వకంగా కట్టుకున్న భర్తను నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని పేర్కొంది.
అయితే కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ఇలాంటి దారుణమైన పరిస్థితే నెలకొంది. అందువల్ల ఈ కారణాల వల్ల విడాకులు మంజూరు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. వాస్తవానికి వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే విడాకుల కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి అయిన తర్వాత కొన్ని జంటలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు. మరికొందరు గొడవలు పడి విడాకులు తీసుకునేవరకు వెళ్తున్నారు. ఈ మధ్య విడాకుల కేసులు కూడా కోర్టుల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం