CBI Raids Delhi: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్తీ మద్యం మరణాలపై CBI విచారణ ఏది?.. కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్..

CBI Rides Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నివాసంతోపాటు 21 చోట్ల CBI సోదాలు సంచలనంగా మారాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేయడంతో నెక్స్ట్‌ ఏదో జరగబోతోంది..

CBI Raids Delhi: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్తీ మద్యం మరణాలపై CBI విచారణ ఏది?.. కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్..
Kejriwal
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2022 | 5:33 PM

CBI Raids Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నివాసంతోపాటు 21 చోట్ల CBI సోదాలు సంచలనంగా మారాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేయడంతో నెక్స్ట్‌ ఏదో జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది. నాడు ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిసోడియాను CBI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందా? అనే ఊహాగానాలూ వచ్చాయి. లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతో CBI ఇటీవలే రంగంలోకి దిగింది. గతేడాది నవంబరులోనే నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు. ఐతే.. ప్రైవేటు వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా కొన్ని నిబంధనలను ఉల్లంఘన జరిగినట్టు, తద్వారా కొందరు లబ్ది పొందినట్టు విచారణ కమిటీ తేల్చింది. జులైలో ఆ నివేదిక ఇచ్చింది. దీనిపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. తర్వాత దీనిపై FIR నమోదైంది. కానీ ఇదంతా కుట్రలో భాగంగానే జరుగుతోందని ఆప్ కౌంటర్ ఇస్తోంది. ఇలాంటి విచారణలకు తాము భయపడేది లేదని CM అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

సీబీఐకి సిసోడియా ఆహ్వానం.. ఇవాళ ఉదయం CBI టీమ్‌ తన ఇంటికి చేరుకోగానే.. సిసోడియా ఓ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా తాము మంచి పనులు చేస్తుంటే ఇలా వేధింపులకు గురి చేయడం దురదృష్టకరమన్నారు. తన ఇంట్లో CBI వాళ్లకు ఏమీ దొరకదని చెప్పుకొచ్చారు. విద్యారంగంలోను, వైద్యరంగంలోనూ ఢిల్లీ సర్కార్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు సిసోడియా. కానీ ఆ రెండు శాఖల మంత్రుల్ని టార్గెట్‌ చేయడాన్ని తప్పుపట్టారు. విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇప్పటికే ED కేసులో అరెస్టైతే.. ఇప్పుడు CBI పేరుతో సిసోడియాను వేధిస్తున్నారని ఆప్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

కేజ్రీవాల్ కౌంటర్.. మంచి పనులు చేయాలనే తమ సంకల్పాన్ని ఇలాంటి దాడులు ఆపలేవని CM కేజ్రీవాల్ అన్నారు. నిర్దేశించుకున్న మిషన్ చేరుకునే క్రమంలో తమకు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. గతంలోనూ ఇలాగే CBI దాడుల పేరుతో హడావుడి చేశారని, ఇప్పుడు కూడా కొత్తగా బయటపడేది ఏమీ ఉండబోదని అన్నారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ ఫ్రంట్ పేజ్‌లో ఆర్టికల్ వచ్చినరోజే ఇలా CBI దాడులు జరగడాన్ని ప్రస్తావించారు. సిసోడియా కంటే మంచి విద్యాశాఖ మంత్రి ప్రపంచంలోనే ఎవరూ ఉండబోరంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ రాష్ట్రాల్లో మరణాలపై ఎందుకు విచారణ చేయడం లేదు? కేజ్రీవాల్ కామెంట్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం CBI రైడ్స్ చేస్తోంది విద్యావిధానంలో లోపాలపై కాదని, ఎక్సైజ్ పాలసీలో అక్రమాలపై అంటూ విమర్శించారు. మద్యం విధానంలో అక్రమాలే కేజ్రీవాల్, సిసోడియా ఎలాంటి వారో చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎక్సైజ్ పాలసీపై విమర్శలు రావడంతో జులై 30నే కేజ్రీవాల్ సర్కారు దీన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడంతో నెక్స్ట్ ఏంటనే చర్చ జరుగుతోంది. అటు.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ పెద్దలు.. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్తీ మద్యం మరణాలపై CBI విచారణకు ఎందుకు ఆదేశించరని ఆప్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..