AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: మీరు సమయానికి ITR ఫైల్ చేసినా రూ. 5000 జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకంటే..

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు చివరి తేదీ గత నెలతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో 5 కోట్ల మందికి పైగా పన్ను..

ITR Filing: మీరు సమయానికి ITR ఫైల్ చేసినా రూ. 5000 జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకంటే..
Itr Filling
Subhash Goud
|

Updated on: Aug 19, 2022 | 5:07 PM

Share

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు చివరి తేదీ గత నెలతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో 5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు చివరి తేదీ వరకు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. ఆ తర్వాత ఐటీఆర్‌ను వెరిఫై చేసేందుకు 120 రోజుల గడువు ఇచ్చారు. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ఐటీఆర్‌ను దాఖలు చేసిన వారు 30 రోజుల్లోపు ఐటీఆర్‌ని ధృవీకరించాల్సి ఉంటుంది. ITR నింపడం కంటే ధృవీకరణ పని చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది సమయానికి ధృవీకరించబడకపోతే ITR చెల్లనిదిగా పరిగణించబడుతుంది. డబ్బు వాపసు అనేది అందుబాటులో ఉండదు. పన్ను చెల్లింపుదారు ITRని ధృవీకరించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ దానిని ప్రాసెసింగ్ కోసం ఫార్వార్డ్ చేస్తుంది.

పైన పేర్కొన్న విధంగా ITR నిర్ణీత సమయంలో ధృవీకరించబడకపోతే పన్ను రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది. అంటే మీరు ITR ఫైల్ చేయనందుకు వర్తించే పెనాల్టీ, ఆలస్య జరిమానాను చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు సమయానికి మీ ITR ధృవీకరించబడనందున అది చెల్లనిదిగా ప్రకటిస్తుంది ఆదాయపు పన్నుశాఖ. తర్వాత మీరు పన్ను శాఖకు అభ్యర్థనను పంపవలసి ఉంటుంది. ఈ అభ్యర్థనను కండోనేషన్ రిక్వెస్ట్ అంటారు. పన్ను శాఖ మీ అభ్యర్థనలో ఇచ్చిన కారణాలను సరైనదిగా పరిగణించి అభ్యర్థనను అంగీకరిస్తే మీ ITR ధృవీకరించబడినట్లు పరిగణించబడుతుంది.

ఒక వేళ మీ అభ్యర్థన తిరస్కరించబడితే మీ ITR చెల్లదు. మీరు మళ్లీ రిటర్న్‌ను ఫైల్ చేసి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్య రుసుముతో పాటు రూ.5 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ITRని ధృవీకరించడంలో ఆలస్యం చేయకండి. నిర్ణీత సమయంలో ఈ పనిని పూర్తి చేయండి.

ఇవి కూడా చదవండి

ఐటీఆర్‌ ఎలా ధృవీకరించాలి:

ITRని ఎలా ధృవీకరించాలి ఐటీఆర్‌ని ధృవీకరించడానికి ఈ మార్గాలు ఉన్నాయి. 1. ఆధార్ OTP

2. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫైలింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి

3. బ్యాంక్ ఖాతా నంబర్ ద్వారా EVC

4. డీమ్యాట్ ఖాతా EVC

5. బ్యాంక్ ATM నుండి EVC

6. ITR V కాపీని పంపడం CPC ఈ ఆరు మార్గాలలో మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధృవీకరించవచ్చు.

ఆధార్ ఓటీపీతో ఈ ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది మొబైల్ నుండి అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీ మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌తో లింక్‌ అయి ఉండాలి. మీరు ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే మీ మొబైల్‌లో OTP వస్తుంది. పన్ను శాఖ సైట్‌లో ఈ OTPని నమోదు చేసి సమర్పించు బటన్‌ను నొక్కాలి. ఆ తర్వాత మీ ITR ధృవీకరించుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పైన పేర్కొన్న ఇతర పద్ధతుల ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది. కావాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వెరిఫై చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అయితే మీ బ్యాంకులో నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి