AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది..

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం
Pm Kisan Samman Nidhi Yojana
Subhash Goud
|

Updated on: Aug 19, 2022 | 4:24 PM

Share

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది మోడీ సర్కార్‌. ఇక కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలలో ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు ఏడాదికి రూ.6,000 చొప్పున సాయం అందుకోవచ్చు. ఈ పథకం కింద ఏడాదిలో మూడు విడతల్లో ఈ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. సంవత్సరంలో మూడు దఫాల్లో రూ.2,000 చొప్పున రైతులు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత అందుకోనున్నారు. ఈ విడత డబ్బులు సెప్టెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇక ఈ పథకంలో ముఖ్య విషయం ఏంటంటే.. కేవైసీ. ఈ పథకం కింద సాయం పొందుతున్న ప్రతి రైతు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ కావు. అందుకే వ్యవసాయంలో పెట్టుబడి సాయంగా ఈ డబ్బులు అందుకోవాలంటే ఈకేవైసీ (EKYC) చేసుకోవడం తప్పనిసరి.

ఈకేవైసీ గడువు పెంపు.. ఇప్పటి వరకు ఈకేవైసీ గడువు జులై 31తో ముసిగిన విషయం తెలిసిందే. ఇంకా కొంత మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో మోడా ప్రభుత్వం రైతులకు మరోమారు అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు మీ ఖాతాలో జమ కావని గుర్తించుకోవాలి. వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి..? ☛ ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

☛ ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.

☛ అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

☛ ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

☛ పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.

☛ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక మీ దగ్గరలో ఉన్న ఈ-సేవ కేంద్రాలకు కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?