Gold Imports: పసిడికి మరింత డిమాండ్‌.. దేశంలో పెరిగిన బంగారం దిగుమతి..!

Gold Imports: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ మొదలైంది. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలో బంగారం దిగుమతులు 6.4 శాతం పెరిగినట్లు..

Gold Imports: పసిడికి మరింత డిమాండ్‌.. దేశంలో పెరిగిన బంగారం దిగుమతి..!
Gold Imports
Follow us
Subhash Goud

|

Updated on: Aug 19, 2022 | 3:17 PM

Gold Imports: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ మొదలైంది. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలో బంగారం దిగుమతులు 6.4 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కాలంలో భారతీయులు విదేశాల నుంచి 12.9 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. దేశంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం దిగుమతులు మరింతగా పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో దేశంలోకి 12 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి అయ్యింది. బంగారం దిగుమతి డిమాండ్ పెరగడం కూడా దేశ వాణిజ్య లోటుపై ఒత్తిడి పెంచింది. బంగారం, అధిక క్రూడ్ ధరల కారణంగా ఈ కాలంలో దేశంలో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు నమోదైంది.

జూలైలో తగ్గిన దిగుమతులు:

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూలై నెలలో బంగారం దిగుమతులు బాగా తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ కాలంలో 2.4 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. ఇది గత ఏడాది జూలైతో పోలిస్తే 44 శాతం తక్కువ. ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పెళ్లిళ్ల సీజన్‌, పండుగ సమయాల్లో డిమాండ్‌ పెరిగింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం భారత్. బంగారం దిగుమతులు పెరగడం వల్ల దేశంలో ఆభరణాల రంగంలో డిమాండ్ మరింతగా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది:

బంగారం దిగుమతులు పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు కూడా పెరిగింది. ఖరీదైన క్రూడ్‌తో ఈ ఏడాది ఏప్రిల్, జూలై మధ్య దేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 30 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏడాది క్రితం ఇదే కాలంలో దేశ వాణిజ్య లోటు 10.63 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అయితే ఈ కాలంలో దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి 13.5 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఉపశమనం కలిగించే విషయమే. ఆభరణాల పరిశ్రమ దేశంలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని ఆభరణాలుగా మార్చడం ద్వారా ఎగుమతి చేస్తుంది. అయితే, ఎగుమతులు పెరిగిన తర్వాత కూడా దేశ వాణిజ్య లోటు వేగంగా పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి