Ram Mandir: అయోధ్య రామ మందిరానికి.. ఏడు ఖండాల నుంచి పవిత్ర జలాలు.. మొదటి విడతలో..
Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మాణమవుతున్న భవ్య రామ మందిరానికి ప్రపంచంలోని పలు దేశాల నుంచి పవిత్ర జలాలను తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఏడు ఖండాల్లోని
Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మాణమవుతున్న భవ్య రామ మందిరానికి ప్రపంచంలోని పలు దేశాల నుంచి పవిత్ర జలాలను తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల నుంచి పవిత్ర జలాలు భారత్‌కు చేరాయి. అయితే.. విదేశాల నుంచి మొదటి విడతలో భారతదేశానికి వచ్చిన 115 దేశాల పవిత్ర జలాలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అందుకున్నారు. ఆయనతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కూడా ఉన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో జరిగింది. వారి వెంట డెన్మార్క్, ఫిజీ, నైజీరియా సహా పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు. బీజేపీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జాలీ నేతృత్వంలోని ఎన్‌జీఓ సంస్థ ద్వారా ఈ పవిత్ర జలాలను సేకరిస్తోంది. ఈ జలాన్ని రామమందిరం నిర్మాణంతోపాటు రాముని అభిషేకానికి వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. 115 దేశాల్లోని హిందువులు, ముస్లింలు, బుద్ధులు, సిక్కులు, యూదులు అక్కడి పవిత్ర నదులతోపాటు సముద్ర జలాలను కూడా పంపించినట్లు తెలిపారు. మరో 77 దేశాలనుంచి పవిత్ర జలాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏడు ఖండాల్లోని 192 దేశాల్లో గల పవిత్ర జలాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. 115 దేశాల నుంచి పవిత్ర జలాన్ని ఇప్పటివరకు సేకరించామని.. రామమందిర నిర్మాణం పూర్తయ్యేలోపు మిగితా 77 దేశాల్లోని జలాలు కూడా దేశానికి చేరుతాయని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, దేశంలో కులాలు, మతాలు ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని మంత్రి తెలిపారు.
Also Read: