Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు..
Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో మూడు రోజుల నుంచి వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఆదివారం కూడా వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.60,000లుగా ఉంది. కిలో వెండిపై తాజాగా రూ.1600 మేర తగ్గింది. రెండు రోజుల నుంచి దాదాపు రూ.3వేల ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,200గా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.60,000 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు ఆదివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకొని షాపులకు వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: