Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో దారుణం.. గంగా నది సమీపంలో ఇసుకలో మృతదేహాలు లభ్యం..
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లాలోని దారుణ ఘటన వెలుగు చూసింది. గంగా నది వెంబడి కనీసం రెండు ప్రదేశాలలో ఇసుకలో..

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లాలోని దారుణ ఘటన వెలుగు చూసింది. గంగా నది వెంబడి కనీసం రెండు ప్రదేశాలలో ఇసుకలో ఖననం చేసిన మృతదేహాలు వెలుగు చూశాయి. కోవిడ్ -19 రోగుల మృతదేహాలు బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోని గంగా నదిలో తేలిన ఘటన వెలుగు చూసిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగు చూడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే, బయటపడిన మృతదేహాలు కోవిడ్ 19 రోగులవా? కాదా? అని అధికారులు నిర్ధారించలేదు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. నదికి దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో మృతదేహాలు లభ్యమయ్యాయని మీడియాకు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందిందని, దీనిపై పరిశోధన జరుగుతోందన్నారు. విచారణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, మృతదేహాలు లభ్యమైన ప్రదేశాలలో ఒకటైన బుక్సర్.. ఫతేపూర్, రాయ్ బరేలీ, ఉన్నావ్ జిల్లాలకు ప్రధాన దహన ప్రదేశంగా ఉందని మేజిస్ట్రేట్ కుమార్ పేర్కొన్నారు. కొంతమంది మృతదేహాలను తగలబెట్టగా.. మరికొందరు వాటిని నది ఇసుకలో పాతిపెడతారిన అన్నారు.
ఇదిలాఉంటే.. మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలోని గంగా నదిలో కొన్ని మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. అయితే ఈ మృతదేహాలు కరోనా వైరస్ రోగులవని అనుమానిస్తున్నారు. ఈ శవాల వలన నీరు కలుషితం అయ్యిందని, కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన ఇలా ఉండగానే.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
కాగా, ఈ విషయంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్.. ఇసుక తిన్నెల్లో లభ్యమైన మృతదేహాలకు మత విశ్వాసాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
कैसे-कैसे मंज़र सामने आने लगे है : गंगा जी के सिरहाने यहां वे ग़रीब सो रहे हैं,जिनके अपने उनकी चिता की लकड़ी भी न खरीद पाए। :रौतापुर,उन्नाव। pic.twitter.com/menK5zORBv
— Kamal khan (@kamalkhan_NDTV) May 12, 2021
Also read:
#AskKTRలో ఆసక్తికర సంభాషణలు, మీరు ఎలా కొవిడ్ ను ఎదుర్కొన్నారన్న ప్రశ్నకు కేటీఆర్ ఫుల్ క్లారిటీ