Covaxin : కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయం, టీకా ఫార్ములా మరికొన్ని కంపెనీలకు.. వేగవంతం కానున్న ఉత్పత్తి

Covaxin production : కరోనా మహమ్మారి భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయించింది..

Covaxin : కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయం, టీకా ఫార్ములా మరికొన్ని కంపెనీలకు.. వేగవంతం కానున్న ఉత్పత్తి
COVAXIN
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: May 13, 2021 | 8:40 PM

Covaxin production : కరోనా మహమ్మారి భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కరోనా టీకా ఉత్పత్తి వేగవంతం కానుంది. తాజా నిర్ణయంతో కొవిడ్ 19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు కేంద్రం ఇవ్వనుంది. కాగా, కేంద్రం తాజా నిర్ణయంపై ఏపీ అధికార పార్టీ వైసీపీ హర్షం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఈనెల 11న సీఎం వైయస్ జగన్ మోహన్ లేఖ రాశారని వైసీపీ పేర్కొంది. కరోనా టీకా ఫార్ములాను మరిన్ని కంపెనీలకు ఇవ్వాలని సదరు లేఖలో సీఎం కోరినట్టు వెల్లడించింది. ఇలా ఉండగా, దేశంలో కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ నుంచి టీకా ఫార్ములాలను సేకరించి.. దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలకు అందించాలని, తద్వారా టీకాల ఉత్పత్తిని పెంచాలని ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ నెల 11న సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక బహిరంగలేఖ కూడా రాశారు. “ప్రస్తుతం సీరం, భారత్‌ బయోటెక్‌ నెలకు 6-7 కోట్ల కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి.. ఈ లెక్కన దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలంటే రెండేండ్లు పడుతుంది. ఈలోపు ఎన్ని కరోనా వేవ్‌లు వస్తాయో.. ఎంత నష్టం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ విపత్తును నివారించాలంటే.. ఆ రెండు కంపెనీల తాలూకు టీకా ఫార్ములాలను దేశంలో సురక్షితంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఇతర కంపెనీలకు కూడా కేంద్రం తెలియజేయాలి” అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Read also : Annapurna Meals : లాక్ డౌన్‌లో అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం.. ఇప్పుడు గ్రేటర్లో రోజూ 45వేల మందికి..