ఇండియాకు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్, వచ్చే వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ వెల్లడి
రష్యాలో తయారైన కోవిడ్ స్పుత్నిక్ వి.వ్యాక్సిన్ ఇండియాకు చేరిందని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ తెలిపారు. వచ్చేవారం నుంచి ఇది మన మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని ఆయన గురువారం వెల్లడించారు.
రష్యాలో తయారైన కోవిడ్ స్పుత్నిక్ వి.వ్యాక్సిన్ ఇండియాకు చేరిందని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ తెలిపారు. వచ్చేవారం నుంచి ఇది మన మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని ఆయన గురువారం వెల్లడించారు. రష్యా నుంచి మరిన్ని డోసుల వ్యాక్సిన్ రానుందని, మనకు టీకామందుల కొరత కొంతవరకు తీరనుందని ఆయన చెప్పారు. జులై నుంచి ఈ టీకామందును ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారని, 15.6 కోట్ల డోసులను తయారు చేయాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్ కి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రష్యా కంపెనీకి భాగస్వామిగా ఉందన్నారు. రానున్న 5 నెలల్లో 200 కోట్ల డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ని ఇండియా ఉత్పత్తి చేస్తుందని, వినియోగిస్తుందికూడానని పాల్ పేర్కొన్నారు. 91.6 శాతం సామర్థ్యం గల ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటాను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. ఇది సురక్షితమైనది, సామర్థ్యం గలది కూడా అని ఈ పత్రిక స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విషయంలో రష్యా తన సమాచారాన్ని ఇతర దేశాలతో ఎందుకు షేర్ చేసుకోలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఏమైనా. స్పుత్నిక్ వి.వ్యాక్సిన్ విషయంలో లోగడగల సందేహాలన్నీ నివృత్తి అయ్యాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఫైజర్ సంస్థ తయారు చేసిన టీకామందు సరఫరాపై ఇండియా లోగడ ఆ సంస్థతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని డా. పాల్ తెలిపారు. ఆ కంపెనీ తన సొంత రూల్స్ ని ప్రస్తావించిందని, ఈ ఏడాది జులై లేదా ఆగస్టు లేక సెప్టెంబరు నాటికి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,693 కరోనా కేసులు.. 33 మంది మృతి..
AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి