Good News: కరోనా కట్టడికి మరో ఔషధం.. డీఆర్‌డీఓ ‘2-డీజీ’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

2-DG Drug - DCGI: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం నాలుగు లక్షల కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది

Good News: కరోనా కట్టడికి మరో ఔషధం.. డీఆర్‌డీఓ ‘2-డీజీ’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌
2-deoxy-D-glucose
Follow us

|

Updated on: May 08, 2021 | 2:44 PM

2-DG Drug – DCGI: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం నాలుగు లక్షల కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాను అరికట్టేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా చేపడుతూనే ఉన్నారు. ఇప్పటివరకూ మూడు వ్యాక్సిన్లకు దేశంలో అనుమతి లభించింది. తాజాగా కరోనాపై పోరుకు.. మ‌రో కీల‌క అస్త్రం కూడా అందుబాటులోకి రానుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) రూపొందించింది. డీఆర్డీవో త‌యారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని డీసీజీఐ వెల్లడించింది. క‌రోనా బాధితులకు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో శనివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇది జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్ప‌త్తి చాలా సులువ‌ని డీసీజీఐ వెల్లడించింది. కావున ఇది పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. దీనిని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగ‌టివ్‌గా తేలిన‌ట్లు డీఆర్‌డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో తెలిపింది. ఈ డ్ర‌గ్ పొడి రూపంలో ఉండి, సాచెట్‌ల‌లో వ‌స్తుంది. దీనిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగితే చాలు. ఇది వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీవో తెలిపింది.

డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌తో క‌లిసి డీఆర్డీఓ ల్యాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇది క‌రోనా బాధితులు త్వరగా కోలుకోవ‌డంలో స‌హ‌క‌రిస్తోంద‌ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో వెల్లడైంది. పైగా క‌రోనా పేషెంట్ల‌కు కృత్రిమ‌ ఆక్సిజ‌న్ అవ‌స‌రాన్ని త‌గ్గిస్తుందని డీఆర్‌డీవో వెల్లడించింది.

Also Read:

Remedesvir: గుజరాత్ కేంద్రంగా నకిలీ రెమిడెస్విర్ ఇంజక్షన్లు.. ఇండోర్ లో తీగ లాగితే కదిలిన సూరత్ డొంక..దేశవ్యాప్త దందా!

Fake Remdesivir: నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌లను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు