Cyclone Mocha: ముంచుకొస్తున్న మోచా తుఫాను..ఆ రాష్ట్రాలకు ముప్పు
అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒకవేళ ఈ తుపాను ఏర్పడితే దీనికి మోచా అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. యెమెన్ దేశంలోన్ పోర్టు నగరమైన మోచా పేరు మీదుగా ఈ పేరు పెట్టినున్నట్లు తెలిపింది. మే 6 నాటికి ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని.. ఆ మరుసటి రోజున అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు.
ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9 నాటికి తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.అయితే ఆ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు. అయితే సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్‌లో బంగాళాఖాతం లో తరచూగా తుపానులు ఏర్పడుతాయి. మే నెలలో వీటి ముప్పు మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
