మాంత్రికుడి మాట నమ్మి.. కొడుకు పుట్టాలని కూతురిని తల నరికి హత్య చేసిన తండ్రి..
దేశంలో సాంకేతిక రంగం దూసుకుపోతున్న ఈరోజుల్లో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు లేకపోలేదు. వాటి మీద విశ్వాసంతో నేటికీ చాలా చోట్ల దారుణాలు జరుగుతున్నాయి.

Crime News: దేశంలో సాంకేతిక రంగం దూసుకుపోతున్న ఈరోజుల్లో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు లేకపోలేదు. వాటి మీద విశ్వాసంతో నేటికీ చాలా చోట్ల దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి రాంచీలో చోటు చేసుకుంది. మూఢనమ్మకాలపై విశ్వాసంతో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి సొంత కూతురిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్ రాజధాని రాంచీలో నివసించే సుమన్ నాగసియా(6) దినసరి కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉన్నప్పటికీ కొడుకు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే ఓ మంత్రగాడిని వెళ్లి కలిశాడు. ‘నీ ఆరేళ్ల కూతురును బలిస్తే నీకు మగబిడ్డ పుడతాడని ఆ మాంత్రికుడు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన సుమన్ తన కుమార్తెను అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సుమన్‌ను అదుపులోకి తీసుకుని.. మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.
Also Read:
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..