సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. కరోనా భయంతో ఎడారి దేశంలో ఈ లీగ్‌ను నిర్వహించినా ప్రేక్షకులకు బాగానే కిక్కు ఇచ్చింది. మరో ఆరు నెలల్లో 14వ సీజన్ ప్రారంభం కానుంది.

IPL 2021: ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. కరోనా భయంతో ఎడారి దేశంలో ఈ లీగ్‌ను నిర్వహించినా ప్రేక్షకులకు బాగానే కిక్కు ఇచ్చింది. మరో ఆరు నెలల్లో 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఇండియాలోనే జరగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్- 2021కి కొత్తగా తొమ్మిదో టీమ్ రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చంటూ క్రికెట్ ప్రేమికులు డిసైడ్ అయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య ఐపీఎల్-2021ను నిర్వహించడం దాదాపు ఖాయం కావడం వల్ల ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను చూడటానికి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ రేస్‌లోకి దిగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ తరుపున ఓ టీం బరిలోకి దిగబోతోందని.. అంతేకాకుండా వారి హోం గ్రౌండ్ అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియం కాబోతోందని టాక్. ఇక తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కెప్టెన్‌గా ఉండనున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Also Read:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!
ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..
కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..