Hair-cutting : ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే..!
ఉరుకుల పరుగు జీవితంలో భోజనం చేయానికే సమయం కేటాయించలేకపోతున్నారు చాలామంది. ఎంప్లాయిస్‌కి అయితే వారానికి ఒక్క రోజు సెలవు.. బ్యాచిలర్స్ సంగతి పక్కన పెడితే ఫ్యామిలీ మ్యాన్‌కి మొత్తం పనులన్నీ ఆరోజే చేసుకోవాల్సి వస్తుంది. సెలవు వచ్చిందన్న సంతోషం కన్నా పనులు అవుతాయో అవ్వవోనన్న టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఈ వారం ..వచ్చే వారం అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన హెయిర్ కటింగ్ కూడా ఆరోజే చేయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ పని పెట్టుకుంటారు. శుక్రవారం, మంగళవారం జుట్టు కట్ చేయకూడదని కొందరు నమ్ముతారు. అందుకే ఆదివారం దీనికి శ్రేయస్కరం అనుకొని ఆరోజు చేయించుకుంటారు. కానీ ఇది అస్సలు మంచిదికాదంటున్నారు నిపుణులు. ఎందుకో.. ఏమిటో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం హెయిర్ కటింగ్ శుభప్రదం కాదట. ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనిని అంతగా పట్టించుకోరు. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని సూర్యభగవానుడికి అంకితం చేస్తారు. అందుకే ఈ రోజును భానువారమని కూడా పిలుస్తారు. నిపుణుల ప్రకారం..సూర్యుడు ఆరోగ్యం, శక్తి, సంపద గౌరవానికి సంకేతం. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం వలన సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందట. జుట్టు కత్తిరించడం వలన సంపద లేదా శక్తి తగ్గిపోవడానికి దారితీస్తుందని కొందరు భావిస్తారు. జుట్టును శరీరంలోని శక్తి కేంద్రంగా చెబుతారు. అందుకే ఆదివారం హెయిర్ కట్ చేయించకపోవడమే మంచిదంటున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. పుట్టినరోజులప్పుడు, మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించరు. చాలామంది శనివారం కూడా హెయిర్ కట్ చేయించరు. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజు కూడా కటింగ్ చేయించరు. హెయిర్‌కట్‌తో పాటు ఆదివారం ఇంటి బూజులు దులిపి శుభ్రం చేయడం లాంటివి చేయకూడదట. వీటి వలన సానుకూల శక్తి తగ్గుతుందని చెబుతారు. అలాగే కొత్తగా ఏదైనా పనులు చేపట్టటం, ప్రారంభించడం శుభకరం కాదట. వాస్తవానికి ఇవన్నీ ఆయా ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాలను బట్టి విశ్వసిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా ఆదివారం ఈ పనులు చేయకూడదని ఆధారాలు లేనప్పటికీ, సాధారణంగా ఆదివారం రోజు ఎక్కువగా పనులు పెట్టుకోవడం కంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..