Vidura Niti: ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా..?
మహాభారతంలో విదురుడు చెప్పిన విదుర నీతి నియమాలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఒంటరిగా తినడం, నిర్ణయం తీసుకోవడం, ప్రయాణించడం, నిద్రపోవడం మంచిది కాదని అంటున్నారు విదురుడు. ఈ మాటలు నేటి జీవితానికి కూడా బాగా వర్తిస్తాయి. ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకూడదు.

విదురుడు మహాభారతంలో ఎంతో బుద్ధిమంతుడైన వ్యక్తి. అతను ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు. రాజు ఎదుట కూడా నిజమే చెబుతూ ధైర్యంగా ఉండేవాడు. విదురుడి మాటలు చాలా ఉపయోగకరమైనవి. అతను చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు విదుర నీతిగా ప్రసిద్ధి చెందాయి. ఇవి మనకు బతకడంలో మార్గం చూపిస్తాయి. ముఖ్యంగా ఒంటరిగా చేసే కొన్ని పనులు మనకు హానికరం కావచ్చు అని విదురుడు చెబుతున్నాడు.
విదురుడు చెప్పిన దాని ప్రకారం.. రుచికరమైన ఆహారం ఒంటరిగా తినకూడదు. అలాంటి ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే మనకు ఆనందం వస్తుంది. తినే సమయంలో మన చుట్టూ మనుషులు ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది. అందుకే ఏదైనా మంచి ఆహారం ఉంటే దానిని స్నేహితులు, కుటుంబంతో కలిసి తినాలి.
విదురుడు చెప్పినట్టు ఏ పెద్ద పని చేయాలన్నా దానిపై ఇతరుల అభిప్రాయం తీసుకోవాలి. మనకు అనిపించినట్టు నిర్ణయం తీసుకుంటే తప్పు జరగొచ్చు. ఒకరి వ్యక్తిగత నిర్ణయం కన్నా.. అందరి సూచనలతో తీసుకున్న నిర్ణయం ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నమ్మకమైన వ్యక్తుల నుంచి అభిప్రాయం తీసుకుని మాట్లాడాలి.
విదురుడు చెప్పినట్టు ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. మనం ఒంటరిగా దారిలో వెళ్తుంటే ఏవైనా సమస్యలు ఎదురవొచ్చు. మార్గం తెలియక పోవచ్చు, లేకపోతే ఎవరైనా దోపిడీ చేయొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ మనతో పాటు ఇంకొకరు ఉంటే మంచిది. అది సురక్షితం కూడా.
విదురుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఇది. ఒక చోట చాలా మంది నిద్రపోతే.. మనం ఒంటరిగా మేల్కొని ఉండడం మంచిది కాదు. ఒంటరితనం వల్ల మనం భయపడవచ్చు.. అనవసర ఆలోచనలు రావొచ్చు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే ప్రతి ఒక్కరితో పాటు మనం కూడా నిద్రపోవాలి.
విదుర నీతి మనకు జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్లో స్పష్టమైన మార్గం చూపుతుంది. ఈ నాలుగు విషయాలు.. తినే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో, ప్రయాణంలో, నిద్రపోయే విషయంలో మనం ఒంటరిగా ఉండకూడదు. ఇవి పాటిస్తే మన జీవితం సుఖంగా, భద్రంగా ఉంటుంది.