AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: చంద్రుడి ప్రభావం ఉన్న వీరి ప్రేమ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా..?

సంఖ్యాశాస్త్రం ప్రకారం 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారికి మూలసంఖ్య 2గా వస్తుంది. ఈ సంఖ్యను చంద్రుడు పాలిస్తాడు. చంద్రుడి స్వభావం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అందుకే ఈ తేదీల్లో పుట్టినవాళ్లు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అటువంటి వారు భావోద్వేగాలను లోపల పెట్టుకుని అనుభవిస్తారు కానీ బయటకు వ్యక్తపరచలేరు.

Numerology: చంద్రుడి ప్రభావం ఉన్న వీరి ప్రేమ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా..?
Numerology Secrets
Prashanthi V
|

Updated on: Apr 13, 2025 | 2:48 PM

Share

ప్రేమ, మిత్రత్వం, కుటుంబ బంధాలలో చాలా ఆప్యాయంగా ఉంటారు. కానీ తమ మనసులో ఏముందో చెప్పాలంటే మాత్రం వెనక్కి తగ్గిపోతారు. ఈ అబ్బాయిలు ప్రేమ విషయంలో చాలా లోతైన భావనలు కలిగి ఉంటారు. కానీ తన భావాలను వ్యక్తపరచడంలో సంకోచిస్తారు. ఒకవేళ ప్రేమించినా చెప్పడానికి భయపడిపోతారు. వారు నిజంగా ప్రేమించినా ఆ ప్రేమను చెప్పలేకపోవడం వల్ల ఎదుటివారితో బంధం ఏర్పడకుండా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.

అనవసర ఆలోచనలు

ఈ సంఖ్యకు చెందిన వారు ఏ విషయంలోనైనా గుండెల్లో పెట్టుకుని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఏ చిన్న విషయం జరిగినా దానిని ఎంతో పెద్దగా ఊహించుకుంటారు. ఈ విధంగా ఎక్కువగా ఆలోచించటం వల్ల నిర్ణయం తీసుకునే విషయంలో స్పష్టత ఉండదు. ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సేపు వెచ్చిస్తారు. కానీ చివరికి ఏదీ తేల్చుకోలేరు. ఈ అలవాటు వారి వ్యక్తిగత జీవితానికీ, ఉద్యోగ జీవితానికీ ప్రతికూల ప్రభావం చూపుతుంది.

సున్నితమైన హృదయం

ఈ సంఖ్యలో పుట్టిన వారు ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. చిన్న చిన్న మాటలు, హావభావాలు కూడా వారి మనసుపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే చాలా సందర్భాల్లో మోసపోతుంటారు. ఎవరైనా తమకు దగ్గరయ్యాక వాళ్లకు ఏదైనా కష్టం కలగకూడదని.. తాము వారికి హాని చేయకూడదని భావిస్తూ.. అలాంటి వ్యక్తుల నుండి కాస్త దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అయితే దీని వల్ల చివరికి వాళ్లు ఒంటరిగా మిగిలిపోతారు.

ప్రేమలో బాధ్యతతో పాటు భయం

ఈ సంఖ్యలో పుట్టిన వారు ప్రేమను చాలా పవిత్రంగా భావిస్తారు. కానీ తమ మనసులో ఉన్న భావాలను బయటపెట్టాలంటే భయపడిపోతారు. ఎదుటివాడు తిరస్కరిస్తాడేమో, లేదా అపహాస్యం చేస్తాడేమో అన్న భయంతో తన ప్రేమను హృదయంలోనే దాచిపెడతారు. ఈ విధంగా ప్రేమను వ్యక్తపరచలేకపోవడం వల్ల వారు లోతైన భావోద్వేగ బాధను అనుభవించాల్సి వస్తుంది.

సంఖ్య 2వారిలో ప్రేమ, బాధ్యత, నమ్మకం వంటి విలువలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనవసర ఆలోచనలు, భయాలు వాళ్ల జీవితంలో సమస్యలకు దారి తీస్తాయి. చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకోవడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. వీరు తమ మనస్సులో ఉన్న విషయాలను ధైర్యంగా బయటపెట్టుకోవడాన్ని నేర్చుకుంటే జీవితంలో మంచి మార్పులు రావచ్చు.