Saturday Puja Tips: శని దోషం తొలగడానికి శనివారం ఈ నూనెతో శనిశ్వరుడికి పూజ చేయండి.. అనుగ్రహం మీ సొంతం
శనివారం శనిదేవుని రోజుగా పరిగణించబడుతుంది. అందుకే శనిశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం రోజున ప్రత్యేకంగా పుజిస్తారు. ఈ రోజున శనిశ్వరుడికి నువ్వుల నూనె లేదా ఆవ నూనెను సమర్పిస్తారు. దానాలు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. మనం ఎల్లప్పుడూ మంచి పని చేయాలని.. అప్పుడే జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయని శనిశ్వరుడు మనకు బోధిస్తాడు.

శని అనేది హిందూ మతంలో శని గ్రహానికి చెందిన దైవిక వ్యక్తిత్వం. శనీశ్వరుడు కర్మ, న్యాయం, సమయం, ప్రతీకార దేవుడిగా భావిస్తారు. ప్రజలకు తమ మంచి , చెడు పనుల ఆధారంగా ఫలాలను ఇస్తాడు. సూర్య భగవానుడు, ఛాయదేవిల తనయుడు. శనిశ్వరుడు నలుపు రంగులో ఉంటాడు. కాకిపై స్వారీ చేస్తాడు. చాలా నెమ్మదిగా కదులుతాడు. అందుకే శనిశ్వరుడిని మందగమనుడు అని అంటారు. జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో శనిశ్వరుడు ఒకటి. శనిశ్వరుడు ప్రభావం సత్యవంతులు, కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులకు ఆనందాన్ని ఇస్తుంది. సోమరివారిపై లేదా ఇతరులను బాధపెట్టే వారికి కష్టాలను ఇస్తుంది.
నూనెను సమర్పించే సంప్రదాయం ఎలా మొదలైంది?
ఒక పురాణం ప్రకారం రావణుడు తన శక్తితో తొమ్మిది గ్రహాలను బంధించినప్పుడు.. అప్పుడు రావణుడు శనిశ్వరుడిని చెరసాలలో తలక్రిందులుగా వేలాదీసి ఉంచాడు. ఎందుకంటే అతను న్యాయ దేవుడు. హనుమంతుడు సీతను వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు.. రావణుడు హనుమంతుడి తోకకు నిప్పంటించాడు. అప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. లంక మొత్తం కాలిపోవడం వల్ల.. అన్ని గ్రహాలు స్వయంచాలకంగా విముక్తి పొందాయి. అయితే శనిశ్వరుడు తలక్రిందులుగా వేలాడదీయబడ్డాడు.. దీని కారణంగా శనిశ్వరుడు విముక్తి పొందలేదు.
చాలా సంవత్సరాలుగా తలక్రిందులుగా వేలాడుతుండటం వల్ల.. శనిశ్వరుడు శరీరం చాలా నొప్పిగా ఉంది. అతను ఆ నొప్పితో బాధపడుతున్నాడు. తరువాత శనిశ్వరుడు నొప్పిని తగ్గించడానికి.. హనుమంతుడు తన శరీరాన్ని నువ్వుల నూనె తో మసాజ్ చేసుకున్నాడు. అప్పుడు శనిశ్వరుడు నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. అప్పటి నుంచి శనిశ్వరుడికి ఆవాల నూనెను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది.
నూనె సమర్పించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిశ్వరుడికి ఆవ నూనెను సమర్పించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. శనిదేవునికి సంబంధించిన ఏలి నాటి శని, ధైయ్య, శని దోషం మొదలైన సమస్యలు తొలగిపోతాయి. శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు, జీవితంలో విచారం, భయం, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అయితే మనం శనివారం ఆవ నూనెను సమర్పించినప్పుడు.. శనిశ్వరుడు సంతోషిస్తాడు. జీవితంలోని కష్టాలు తగ్గుతాయి. ఇది ప్రజల మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. పనిలో విజయం సాధిస్తారు. చెడు ఆలోచనలను కూడా తొలగిస్తారు. ఇది సులభమైన మార్గం.ఇలా నువ్వుల నూనె లేదా ఆవ నూనెను మనం శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందవచ్చు.
ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత
హిందూ మతంలో, సంస్కృతిలో ఆవ నూనె చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాలలో ఆవనూనె దుష్ట శక్తులను తరిమివేస్తుందని చెప్పబడింది. అందుకే పూజ సమయంలో దీపాలను వెలిగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరం బలపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జలుబు , దగ్గును కూడా నివారిస్తుంది. దీనిని ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ నూనె చర్మానికి కూడా చాలా మంచిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.