Vastu Tips for Home: మీ ఇంటికి అనుకోని అతిధిలా ఈ పక్షులు వచ్చాయా.. ఎన్ని శుభాలను తెస్తాయో తెలుసా..
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పక్షులు మీ ఇంటికి వస్తే అవి అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. చిలుక లేదా నెమలి ఇంటికి వస్తే అది శుభ సంకేతంగా భావిస్తారు. నల్ల చీమలు ఇంటికి ఆర్థిక ప్రయోజనాలను తెస్తాయని నమ్ముతారు. ఈ రోజు వ్యాసం వాస్తు శాస్త్రం ప్రకారం ఏ పక్షులు , కీటకాలు ఇంటికి అనుకోని అతిధుల్లా వస్తే శుభప్రదమైనవో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి స్థలం భౌతిక శక్తిని ప్రసరింపజేస్తుందని చెబుతారు. దీని ప్రకారం ఇంటిలో ఉండే వస్తువులు విషయంలో మాత్రమే కాదు ఇంటికి వచ్చే పక్షుల గురించి కూడా వివిధ నమ్మకాలు ఉన్నాయి. కొన్ని పక్షుల రాక శుభప్రదంగా భావిస్తారు. ఉదాహరణకు ఇంటి దగ్గర కాకి కనిపిస్తే, అతిథులు వస్తారని లేదా గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే శాంతి, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే.. ఇది పూర్తిగా నమ్మకాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు వాస్తు ప్రకారం ఇంట్లో అతిధిలా ఏ పక్షి వస్తే శుభమో ఈ రోజు తెలుసుకుందాం..
అనుకోని అతిధిలా చిలుక రాక
వాస్తు ప్రకారం ఇంట్లోకి చిలుక రాక .. చిలుక కువ కువ రాగాలు చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది వ్యాపార వృద్ధికి సూచన అట. అంతేకాదు ఇంట్లో ఉన్నవారి మనసు రిఫ్రెష్ అవుతుంది. సంతోషంగా ఉంటారు. అందువల్ల అనుకోకుండా మీ ఇంటికి చిలుక వస్తే అది చాలా శుభప్రదమని నమ్ముతారు.
ఇంట్లోకి నెమలి రాక:
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం నెమలి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆవరణలోకి ప్రవేశిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తికేయుడి వాహనమైన నెమలి ఇంట్లోకి లేదా నివాస ప్రాంతంలోకి ప్రవేశిస్తే.. అది ఆ ఇంటిలో ఉన్న సమస్యలు, కష్టాలు తొలగిపోనున్నాయని సంకేతం అట. మీరు రానున్న మంచికి సంకేతం అని నెమలి రాక అని నమ్మకం.
నల్ల చీమలు:
ఇంట్లో నల్ల చీమలు ఉండటం చాలా శుభప్రదంగా… మంచిగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఆర్థిక లాభాలను పెంచుకునే అవకాశాలు కలగానున్నాయని సూచన. అంతేకాదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఎటువంటి పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.