AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

German: 8 కోట్ల జనాభాకు పెను సమస్యగా మారిన చీమలు.. విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..

చీమలకు ఉన్న శక్తి గురించి సుమతీ శతకంలో బద్దెన గారు ఎప్పుడో చెప్పారు. దీనికి ఓ దేశం ఇపుడు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 8 కోట్ల జనాభా ఉన్న దేశంలో చీమలు పెద్ద సమస్యగా మారాయి. ఒక జాతికి చెందిన చీమలు భారీ కాలనీలు విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. జర్మనీలోని కీల్ నగరంలో అనేక విద్యుత్ అంతరాయం కేసులు నమోదయ్యాయి. దానిపై నియంత్రణ సాధించడానికి శాస్త్రీయ , పరిపాలనా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

German: 8 కోట్ల జనాభాకు పెను సమస్యగా మారిన చీమలు.. విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..
Ants Sleep
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2025 | 6:30 PM

ప్రపంచంలోని అత్యంత దారుణంగా దాడి చేసే చీమలు జర్మనీలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ దేశంలో ఎర్రటి అగ్ని చీమల జాతి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ చీమలు ‘టాపినోమా మాగ్నమ్’ జాతికి చెందినవి. మధ్యధరా ప్రాంతం నుంచి వచ్చిన ఈ చీమలు ఇప్పుడు ఉత్తర జర్మనీ వైపు వేగంగా కదులుతున్నాయి. ఈ సమయంలో విద్యుత్ , ఇంటర్నెట్ సేవలు కూడా అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ జాతికి చెందిన చీమలు భారీ కాలనీల్లోని సాంకేతిక మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే కాదు మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

కార్ల్స్రూహేలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని కీటక శాస్త్రవేత్త మాన్‌ఫ్రెడ్ వెర్హాగ్ ప్రకారం.. టాపినోమా మాగ్నమ్ సూపర్ కాలనీలలో మిలియన్ల చీమలు ఉన్నాయి. ఇవి సాంప్రదాయ చీమల జాతుల కంటే అనేక రెట్లు పెద్దవి. ఈ భారీ చీమలు జర్మనీలోని కొలోన్, హనోవర్ వంటి ఉత్తర నగరాలకు చేరుకున్నాయి. దీని కారణంగా విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ నెట్‌వర్క్ వంటి సాంకేతిక మౌలిక సదుపాయాలు ప్రమాదంలో పడ్డాయి.

శాస్త్రవేత్తలు ఏమి చెప్పారంటే

ఈ చీమలు ముఖ్యంగా బాడెన్-వుర్టెంబర్గ్ పరిసర ప్రాంతాలలో వేగంగా కాలనీలను ఏర్పరుచుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జాతి కారణంగా కిహాల్ అనే నగరంలో విద్యుత్ ,యు ఇంటర్నెట్ ఇప్పటికే నిలిపివేయబడ్డాయి. అంతేకాదు ఈ చీమల ఉనికి ఫ్రాన్స్ , స్విట్జర్లాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలలో కూడా నమోదైంది. అటువంటి పరిస్థితిలో చీమలు సృష్టిస్తున్న ఈ సంక్షోభం జర్మనీకి మాత్రమే పరిమితం కాదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పర్యావరణ కార్యదర్శి హెచ్చరిక

అయితే.. స్థానిక పర్యావరణ వ్యవస్థపై ఈ చీమల విస్తృత ప్రభావం పడినట్లు ఎక్కడా నిరూపించబడలేదు. కనుక ఈ టాపినోమా మాగ్నమ్‌ చీమలను ఇంకా అధికారికంగా ఆక్రమణ జాతిగా ప్రకటించలేదు. అయినప్పటికీ బాడెన్-వుర్టెంబర్గ్ పర్యావరణ కార్యదర్శి ఆండ్రీ బామన్ ఈ చీమలను ఒక తెగులుగా పరిగణించాలని, సకాలంలో నియంత్రించకపోతే.. ఇవి భారీ నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు.

చీమలను ఆపడానికి ప్రయత్నాలు

చీమలు తెస్తున్న ముప్పు దృష్ట్యా జర్మన్ శాస్త్రవేత్తలు, పరిపాలనా సంస్థలు సంయుక్తంగా ఈ చీమల వ్యాప్తిని ఆపడానికి ఒక ప్రాజెక్టుని చేపట్టాయి. కలిసి పనిచేస్తున్నాయి. సాంకేతిక మౌలిక సదుపాయాలు, పర్యావరణం, పౌరులకు జరిగే నష్టాన్ని సకాలంలో నివారించగలిగేలా ఈ దిశలో మొదటిసారిగా వ్యవస్థీకృత ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇకపై చీమలు కేవలం ఒక తెగులు కాదని.. త్వరలో జాతీయ సవాలుగా మారనున్నాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..