AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quick Idli Batter: పప్పు నానబెట్టడం, రుబ్బడం అక్కర్లేదు.. ఇన్​స్టంట్​ ఇడ్లీ పొడి చేసుకోండి.. అప్పటికప్పుడే దూదిలాంటి ఇడ్లీలు రెడీ.. రెసిపీ

తెల్లగా గుండ్రంగా మెత్తని దూదిలా కనిపించే ఇడ్లీలను కొబ్బరి చట్నీ, కారం పొడి, నెయ్యి వేసుకుని తింటారు. ఆవిరి మీద ఉడికించి తయారు చేయడంతో ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకనే ఎక్కువ మంది ప్రజలు టిఫిన్ అంటే ఇడ్లీ అంటారు. దీనిని తయారు చేసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్.. కనుక ఇప్పుడు ఇడ్లీ కంటే ఇనిస్టెంట్ గా చేసుకునే మ్యాగీ , పాస్తా వంటి వాటిని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ రోజు పప్పు నానబెట్టడం, రుబ్బడం లేకుండా తక్కువ సమయంలోనే ఇడ్లీ తయారు చేసుకునే విధానం గురించి తెలుగుకుందాం..

Quick Idli Batter: పప్పు నానబెట్టడం, రుబ్బడం అక్కర్లేదు.. ఇన్​స్టంట్​ ఇడ్లీ పొడి చేసుకోండి.. అప్పటికప్పుడే దూదిలాంటి ఇడ్లీలు రెడీ.. రెసిపీ
Instant Idli Powder Recipe
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2025 | 5:23 PM

దక్షిణ భారతదేశంలో టిఫిన్ అంటే ముందుగా వినిపించే పేరు ఇడ్లీ. ఈ అల్పాహార వంటకం రోజూ ప్రతి ఉదయమే కనిపిస్తుంది. మెజార్టీ పీపుల్​ ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​ ఇడ్లీలు. ఆవిరి మీద ఉదికిచడంతో తేలికగా జీర్ణం అవుతాయి. అయితే ఇడ్లీని తయారు చేసుకోవాలంటే మినపప్పుని నానబెట్టి మెత్తగా రుబ్బి.. పిండి ఒక గిన్నెలోకి తీసుకుని బియ్యం రవ్వ కలిపి పులియబెట్టి ఇడ్లీ చేరుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. దీంతో చాలా మంది ఇన్​స్టంట్​ ఇడ్లీల వైపు మొగ్గచూపుతున్నారు. అయితే ఈ రోజు మినప పప్పు నానబెట్టడం, రుబ్బడం వంటి పని లేకుండా ఒక పొడిని రెడీ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దూది లాంటి మెత్తని ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇన్​స్టంట్​ ఇడ్లీ పిండి తయారీ విధానం మీ కోసం

కావాల్సిన పదార్ధాలు

ఛాయ మినప గుళ్ళు – రెండు కప్పులు

అటుకులు – రెండు కప్పులు

ఇవి కూడా చదవండి

మెంతులు – అర టీ స్పూన్

ఇడ్లీ రవ్వ – ఐదు కప్పులు

ఉప్పు – రెండు టీ స్పూన్లు

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడి ఎక్కిన తర్వాత మినప గుళ్ళు వేసుకుని వేయించాలి. పచ్చి వాసన పోయేవరకూ వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో అటుకులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మినప గుళ్ళుతో పాటు అటుకులను కూడా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి మినప గుళ్ళను వేసి మొత్తని పౌడర్ గా పట్టుకోవాలి. ఈ పిండిని జల్లించి.. నూకలువస్తే మళ్ళీ మిక్సిలో వేసి పిండి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అటుకులను కూడా మెత్తగా పిండిగా మిక్సీ పట్టుకుని మినప పిండి ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులో ఐదు కప్పుల బియ్యం రవ్వ, ఉప్పు వేసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంతే ఇన్​స్టంట్​ ఇడ్లీ పిండి రెడీ. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుని తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. అంతే “ఇడ్లీ ప్రిమిక్స్” రెడీ అయినట్లే.

ఎప్పుడైనా ఇడ్లీని టిఫిన్ గా చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇడ్లీ ప్రిమిక్స్ పొడి వేసి.. కొంచెం నీరు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి బౌల్ మీద మూత రాత్రంతా పులియబెట్టుకోవాలి. మర్నాడు ఇడ్లీలు చేసుకునే ముందు ఇడ్లీ పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నెయ్యి రాసి.. పిండిని ఆ గుంటల్లో నింపుకోవాలి. ఆవిరి మీద 15 నిమషాల నుంచి 18 నిముషాలు ఉడికిస్తే చాలు.. రుచికరమైన మెత్తని దూది లాంటి ఇడ్లీలు రెడీ. కొబ్బరి చట్నీతో కాని మీకు ఇష్టమైన చట్నీతో కాని వేడి వేడిగా తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..