తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం వైయస్. జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం వైయస్. జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని కోరారు.
మరోవైపు తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలగాలని, అన్నదాతల కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలను తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి తీసుకురావాలని కోరుకున్నారు.
మరోవైపు దీపావళి పండుగను ఎన్నో జాగ్రత్తల మధ్య జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం మనం కోవిడ్ మహమ్మారి కనుసన్నల్లో ఉన్నాం. ఈ ప్రమాదకర వైరస్‌కు మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి అత్యంత అప్రమత్తత అవసరం. పండుగ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా షాపింగ్ చేస్తే..వైరస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక చలి తీవ్రత కూడా పెరిగింది. ఇది వైరస్ వ్యాప్తికి అనువైన సమయమని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ మహమ్మారిని లైట్ తీసుకోకుండా, అనునిత్యం పోరాటం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే.
Also Read :
ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్