రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూస్.. డ్రీం ఎలెవన్ టైటిల్ స్పాన్సర్ కావడంతో పెరిగిన ఫాంటసీ క్రీడల అభిమానుల సంఖ్య..
మెగా ఈవెంట్.. బిగ్ ఫైట్.. ఐపీఎల్ 2020. కరోనా కాలంలో ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది ఈ రిచెస్ట్ లీగ్. ఎడారి దేశంలో బయోబబుల్ బుడగలో ఈ టోర్నీని
IPL 2020: మెగా ఈవెంట్.. బిగ్ ఫైట్.. ఐపీఎల్ 2020. కరోనా కాలంలో ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది ఈ రిచెస్ట్ లీగ్. ఎడారి దేశంలో బయోబబుల్ బుడగలో ఈ టోర్నీని నిర్వహించింది బీసీసీఐ. ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరికి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు కూడా అభిమానులకు ఉత్కంఠను కలిగించాయి.
ఇలా అందరి అంచనాలను మించి అలరించిన ఈ లీగ్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చిందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అన్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి 28 శాతం వ్యూయర్స్ పెరిగారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు క్రీడా వినోదాన్ని అందించడంలో ఐపీఎల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని.. దిగ్గజాలు సైతం ఈ లీగ్ వీక్షిస్తారని బ్రిజేష్ పటేల్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా డ్రీం ఎలెవన్ రావడం వల్ల ఫాంటసీ క్రీడల అభిమానులు మరింత మంది ఐపీఎల్‌ను వీక్షించారని అభిప్రాయపడ్డాడు.
కాగా, డ్రీం ఎలెవన్ మరో రెండేళ్లు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది లీగ్ ఇండియాలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా మెగా ఆక్షన్ నిర్వహించాలని చూస్తోంది. అటు గుజరాత్ బేస్డ్ మరో జట్టు కూడా పాల్గొంటుందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్ 2021 అభిమానులకు డబుల్ కిక్క్ ఇస్తుందని చెప్పాలి.
Also Read:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!
ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..