నా సినిమా వాళ్లకు నచ్చదని నాకు ముందే తెలుసు.. లక్ష్మిపై అక్షయ్‌ స్పందన

నా సినిమా వాళ్లకు నచ్చదని నాకు ముందే తెలుసు.. లక్ష్మిపై అక్షయ్‌ స్పందన

తన సినిమాలు చాలా మంది క్రిటిక్‌లకు నచ్చవన్న విషయం తనకు తెలుసని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Nov 13, 2020 | 5:20 PM

Akshay Kumar Laxmii: తన సినిమాలు చాలా మంది క్రిటిక్‌లకు నచ్చవన్న విషయం తనకు తెలుసని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. లక్ష్మి ప్రమోషనల్‌లో భాగంగా మాట్లాడిన అక్షయ్‌.. ”నా సినిమాలు చాలా మంది క్రిటిక్‌లకు నచ్చవు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనుకుంటా. లక్ష్మికి నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ వచ్చింది” అని తెలిపారు. (RRR Movie: మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌ కాలికి మళ్లీ ఏమైంది..!)

కాగా తెలుగు, తమిళంలో ఘన విజయం సాధించిన కాంచన రీమేక్‌గా లక్ష్మి తెరకెక్కింది. ఇందులో అక్షయ్‌ సరసన కియారా అద్వానీ నటించారు. శరద్‌ కేల్కర్‌, తరుణ్ అరోరా, వినితా జోషీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. పాక్స్‌ స్టార్ స్టూడియోస్‌, కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్‌, తుస్సార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ హౌస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 9న విడుదలైన ఈ మూవీ సుశాంత్‌ దిల్‌ బేచారా రికార్డులను బ్రేక్ చేసింది. (డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu