ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్
ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కరోనా కేసుల తగ్గుదలకు ఉపయోగపడుతున్నాయని కోటి కమాండ్ సెంటర్ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు
ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కరోనా కేసుల తగ్గుదలకు ఉపయోగపడుతున్నాయని కోటి కమాండ్ సెంటర్ డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గిందని చెప్పారు. 1200 రాపిడ్, 310 మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. తామే ప్రజల దగ్గరకు వెళ్లి మొబైల్ వ్యాన్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. దీపావళి సమయంలో మరింత అప్రమత్తత అవసరమని, పండుగ కరోనాకు ఉండదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక చలి తీవ్రత కూడా పెరిగిందని… చలి పెరిగితే వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు చలి పెరగడం వల్లే ప్రమాదకర రీతిలో కేసుల సంఖ్య పెరిగి, మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి డాక్టర్లు చెబుతున్నారని ఆయన తెలిపారు.
దీపావళి సందర్భంగా బాణాసంచాలను నిషేధించారని.. అయితే వ్యాపారులకు ఇది ఇబ్బందికర సమస్య అయినప్పటికీ ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి తరువాత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రభలుతాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఫైర్ క్రాకర్స్ లేకుండా ఈ ఏడాది దీపావళి జరుపుకోవాలని సూచించారు. పెళ్లిళ్లలోనూ బాణసంచాకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగల సమయంలో షాపింగ్స్‌కు ఎక్కువగా వెళ్తున్నారని ఆయా సమయాల్లో తప్పక కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాట్లాడే మనిషి మనవాళ్లయినా మాస్క్‌ని తీసివేయడం సరికాదన్నారు. మాస్క్‌ను గడ్డం కిందకి వేసుకోవడం వల్ల అది ధరించినా ఉపయోగం ఉండదని డీహెచ్ చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ను అతి తక్కువ కాలంలో వచ్చేలా చూస్తున్నామన్నారు. ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్ సూచించారు.
Also Read :
ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
రోజూ ‘జానీ వాకర్’ ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు