AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..

తనకు కూతురు పుట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని బౌలర్ టీ నటరాజన్ మురిసిపోతున్నాడు. ఐపీఎల్ 2020లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువ పేసర్..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..
Ravi Kiran
|

Updated on: Nov 13, 2020 | 4:28 PM

Share

Natarajan: తనకు కూతురు పుట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని బౌలర్ టీ నటరాజన్ మురిసిపోతున్నాడు. ఐపీఎల్ 2020లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువ పేసర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. కూతురు పుట్టగానే జాతీయ జట్టులో చోటు దక్కిందని.. నా కూతురే నాకు అదృష్టం తెచ్చిపెట్టిందని నటరాజన్ తెలిపాడు.

నా కూతురు ఫోటోను ఇంకా చూడలేదని, కేవలం వీడియో కాల్‌లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పుకొచ్చాడు. అలాగే తన భార్య రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. ఇక నటరాజన్ తన కూతురిని ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత జనవరిలో చూడనున్నాడు. నవంబర్ 7న నటరాజన్ భార్య పవిత్ర పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను ఫ్యాన్స్‌కు షేర్ చేశాడు.

కాగా, ఆస్ట్రేలియాతో టీ20లకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా వైదొలగడంతో సెలెక్టర్లు నటరాజన్‌ను ఎంపిక చేశాడు. భారత జాతీయ జట్టుకు నటరాజన్ ఎంపిక కావడం పట్ల డేవిడ్ వార్నర్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2020లో హైదరాబాద్ తరపున నటరాజన్ అదరగొట్టాడు. అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్ధులను భయపెట్టిన విషయం విదితమే.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..