రోజూ ‘జానీ వాకర్’ ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు…నిజమండీ బాబు..మీరే చదవండి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో మేలు రకం జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రోజూ 'జానీ వాకర్' ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు...నిజమండీ బాబు..మీరే చదవండి
Follow us

|

Updated on: Nov 12, 2020 | 9:26 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో మేలు రకం జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 15న జరిగే ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ నగరానికి చెందిన ‘లవ్ రానా’ అనే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.  హైదరాబాద్ ఖైరతాబాద్ కు చెందిన మధు​ యాదవ్ ఏడాది కింద హర్యానా నుంచి దానిని కొనుగోలు చేసి తన డైరీ ఫామ్ లో పోషిస్తున్నారు. ఇది నేషనల్ ఛాంపియన్ లో గెలిచిన సుల్తాన్ రాజు దున్నకు పుట్టిన రానా దూడ అని తెలిపారు.

ఖైరతాబాద్ , నారాయణగూడలలో జరిగే సదర్​ వేడుకల్లో లవ్ రానా దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. దీనికి ఉదయం10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ , ఆపిల్స్ పెడుతున్నామని, రోజుకు రూ.10 వేల ఖర్చు అవుతోందని ఆయన వివరించారు. దీంతో పాటు రూ. 3 వేలు విలువ చేసే జానీ వాకర్ ఫుల్ బాటిల్ మందు రోజుకు ఒకటి తాగుతుందని తెలిపారు.

మేలురకం జాతికి చెందిన ఈ దున్నను సదర్ ఉత్సవాలతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం పోషిస్తున్నట్లు వారు వివరించారు. ప్రస్తుతం దీని ధర రూ. 26 కోట్లు పలుకుతుందని కానీ తాము అమ్మడం లేదన్నారు. దీనిని ఒక దున్నపోతులాగ కాకుండ కన్న బిడ్డ లాగా పెంచుకుంటున్నట్లు మధు యాదవ్ స్పష్టం చేసారు.

Also Read :

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్

Latest Articles