ధోని పరువు రోడ్డుకీడుస్తోన్న CSK.. ఇక రిటైర్మెంట్ తీసుకో అన్నా.!
Ravi Kiran
13 April 2025
కేకేఆర్‌పై ఘోర ఓటమి అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో పలు చెత్త రికార్డులన్నీ మూటగట్టుకుంది CSK.
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత తక్కువ స్కోర్(103-9). మొత్తంగా సీఎస్కే చరిత్రలో మూడో అతి తక్కువ స్కోర్ ఇదే.
తొలిసారి 5 మ్యాచ్‌లలో వరుస ఓటములు.. అలాగే తొలిసారి చెపాక్‌లో 3 మ్యాచ్‌లలో వరుసగా ఓటములు చవిచూసింది CSK.
బాల్స్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద ఓటమి ఇది. 59 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలిచింది.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. అయిదింటిలో ఓడిపోయింది. కోల్‌కతా మ్యాచ్‌లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఏప్రిల్ 14న లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, హోం టీం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడనుంది. ఆ తర్వాత ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది.
జట్టులో అందరూ సీనియర్లు ఉండటం.. అలాగే టెస్టు మాదిరిగా జిడ్డు బ్యాటింగ్ ఆడటంతో.. చెన్నై టీం విమర్శలు ఎదుర్కుంటోంది.
ముఖ్యంగా చెన్నై జట్టులో ప్రక్షాళన జరగాలని.. అందరూ ముసళ్లో అంటూ కామెంట్ చేస్తున్నారు. ధోని ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని.. అతడి పరువును CSK రోడ్డుకీడుస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు