Covid-19 Update: దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు
Covid-19 Update: దేశంలో కరోనా మహహ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండేళ్లకుపైగా విజృంభించిన కరోనా (Corona).. ప్రస్తుతం అదుపులో ఉంది. కోవిడ్ 19 కేసుల తగ్గుదల..
Covid-19 Update: దేశంలో కరోనా మహహ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండేళ్లకుపైగా విజృంభించిన కరోనా (Corona).. ప్రస్తుతం అదుపులో ఉంది. కోవిడ్ 19 కేసుల తగ్గుదల కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,568 పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 43 మిలియన్లకు చేరుకున్నాయి. ఇక మరణాలు కూడా వందలోపే నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 97 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 515,974 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ రోజు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్నారు. ఎందుకంటే 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవిడ్-19 టీకాలు వేయడం మార్చి 16 నుండి ప్రారంభం కానుంది.12-14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు టీకా, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరనున్నారు.
దేశంలో చేపట్టిన చర్యల కారణంగా ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాల కూడా తక్కవుగానే నమోదువుతున్నాయి. లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు, వ్యాక్సినేషన్ వంటివి మంచి ఫలితాలు ఇచ్చాయి.
ఇవి కూడా చదవండి: