AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Corona 4th Wave: చైనాలో విజృంభిస్తున్న కరోనా.. రెండేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కొత్త కేసులు..

China Covid-19 Cases: కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న సంతోషంతో ఉన్న ప్రజలను మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

China Corona 4th Wave: చైనాలో విజృంభిస్తున్న కరోనా.. రెండేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కొత్త కేసులు..
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2022 | 7:39 AM

Share

China Covid-19 Cases: కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న సంతోషంతో ఉన్న ప్రజలను మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు. సోమవారం ఒక్కరోజే 2,300 కేసులు రికార్డ్‌ అయ్యాయి. ఒక రోజు ముందు 3,400 కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. దక్షిణ చైనాలో టెక్ హబ్‌గా పిలిచే షెన్‌జెన్‌ సిటీలో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించారు. షెన్‌జెన్‌లో కోటీ 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. దీంతో ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే 24 గంటల్లోపు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపించాలని షరతు విధించారు.

ఫాక్స్‌కాన్‌, హువావే, టెన్‌ సెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. ఆపిల్‌కు సప్లయర్‌ అయిన ఫాక్స్‌కాన్‌ తన కార్యకలాపాలను నిలిపివేసింది. షెన్‌జెన్‌ పరిధిలో ఫ్యాక్టరీలు, స్మాల్‌ స్కే్ల్‌ క్లస్టర్లు ఎక్కువగా ఉండటంతో కమ్యూనిటీ స్ర్పెడ్‌ వేగంగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్‌, హువావే, టెన్‌ సెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. ఆపిల్‌కు సప్లయర్‌ అయిన ఫాక్స్‌కాన్‌ తన కార్యకలాపాలను నిలిపివేసింది. షెన్‌జెన్‌ నగరం హంకాంగ్‌తో సరిహద్దును కలిగి ఉంది. చైనాలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Also Read:

Russia-Ukraine War: యుద్ధ సంక్షోభంతో భారత్ ద్రవ్యోల్బణ షాక్ ఎదుర్కోక తప్పదు

Fake Videos: ఉక్రెయిన్ యుద్ధం @ ఫేక్ వీడియోలు.. నమ్మారో అంతే సంగతులు.. నిజాలు తెల్సుకోండిలా..