GST: జీఎస్టీ నష్టాల భర్తీ మరో 5 ఏళ్లు కావాలంటున్న రాష్ట్రాలు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు..

GST: జీఎస్టీ ప్రవేశపెట్టన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని(Loss of revenue) 5 సంవత్సరాల పాటు భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రాలకు పరిహారాన్ని చెల్లిస్తూ వస్తోంది.

GST: జీఎస్టీ నష్టాల భర్తీ మరో 5 ఏళ్లు కావాలంటున్న రాష్ట్రాలు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు..
GST
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 15, 2022 | 8:27 AM

GST: జీఎస్టీ ప్రవేశపెట్టన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని(Loss of revenue) 5 సంవత్సరాల పాటు భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రాలకు పరిహారాన్ని చెల్లిస్తూ వస్తోంది. దీనిని కేంద్రం 2017 జూన్ 1 నుంచి అమలు చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సర ఆదాయాన్ని బేస్ గా తీసుకుని ఏడాదికి 14 శాతం పెరుగుదలను ప్రామాణికంగా తీసుకుని నష్టాన్ని లెక్కిస్తారు. కానీ.. కేంద్రం ప్రకటించిన ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోనుంది. రాష్ట్రాలకు వస్తున్న నష్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంపెన్సేటరీ ఫండ్(Compensation Fund) నుంచి కేంద్రం ఇప్పటి వరకు భర్తీ చేస్తూ వచ్చింది.

కానీ ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఈ నష్టాల భర్తీని మరింతకాలం పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పద్ధతిని మరో 5 ఏళ్లకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు దిగజారినందున రాష్ట్రాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి లేఖలు అందినట్లు నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు.

2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ కంపెన్సేషన్లను కేంద్రం ఇప్పటికే చెల్లించింది. కంపెన్సేషన్ ఫండ్ లో సొమ్ము చెల్లింపులకు సరిపోకపోవటం వల్ల 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.10 లక్షల కోట్లు, రూ. 1.59 లక్షల కోట్ల అప్పుగా సేకరించి చెల్లింపులు చేసింది. లగ్జరీ వస్తువులపై కేంద్రం వసూలు చేస్తున్న కంపెన్సేషన్ సెజ్ ను 2026 వరకు కొనసాగించనుందని తెలుస్తోంది. ఈ డబ్బును తీసుకున్న అప్పు చెల్లింపులకు వినియోగించనుంది.

ఇవీ చదవండి..

Transgenders Insurance: ట్రాన్స్‌జెండర్ల ఇన్సూరెన్స్ పాలసీలపై IRDAI కీలక నిర్ణయం..

Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!