Zydus Cadila vaccine: భారత్‌లో మరో కోవిడ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. ‘విరాఫిన్’కు అనుమతిచ్చిన డీసీజీఐ
Virafin Covid-19 Vaccine: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓ వైపు నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ
Virafin Covid-19 Vaccine: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓ వైపు నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత్ మరో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. జైడస్ కాడిల్లా తయారు చేసిన ‘విరాఫిన్’ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జైడస్ కాడిల్లా అందించిన వివరాలపై డ్రగ్స్ కౌనిల్ సంతృప్తి వ్యక్తంచేసింది. కొన్ని రోజుల కింద జైడస్ కాడిల్లా తయారు చేసిన విరాఫిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు విరాఫిన్ క్లినికల్ ట్రయల్స్ వివరాలను పూర్తిగా సమర్పించింది. వాటిని పరిశీలించిన డ్రగ్స్ కౌన్సిల్ శుక్రవారం విరాఫిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు జైడస్ కాడిలా ప్రకటించింది. .
ఈ మేరకు భారత్‌లోని 20-25 కేంద్రాలలో నిర్వహించిన మల్టీసెంట్రిక్ ట్రయల్స్‌లో విరాఫిన్.. రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించిందని జైడస్ కాడిల్లా ప్రకటించింది. కోవిడ్ 19 చికిత్సలో ప్రధాన సవాళ్లలో ఒకటైన శ్వాసకోశ ఇబ్బందులను నియంత్రించిందని.. ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా అరికట్టి సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వైరస్ సోకిన ప్రారంభంలోనే ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా అరికడుతుందని కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ పేర్కొన్నారు.
కాగా ఇప్పటివరకు దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాక్సిన్, సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌పర్డ్ టీకా కోవిషీల్డ్ మాత్రమే అనుమతి పొందాయి. తాజాగా విరాఫిన్ అనుమతి పొందడంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకూ దేశంలో 13.5 కోట్ల టీకా డోసులను లబ్ధిదారులకు ఇచ్చారు.
Also Read: