Lockdown: కర్ణాటకలో కరోనా విజృంభణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీఎం నిర్ణయం కోసం వెయిటింగ్
Covid-19 Lockdown in karnataka: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ
Covid-19 Lockdown in karnataka: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించకపోవడంతో.. సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి యూడియూరప్ప మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 12 నాటికి పరిస్థితులను సమీక్షించి.. కేసులు ఇలాగే కొనసాగితే సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాలని క్యాబినేట్ నిర్ణయించింది. కాగా లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలా.. వద్దా.. అనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆయన ఏం చెప్పినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మేం అమలు చేస్తామని తెలిపారు.
కాగా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. బెంగళూరు నగరంలో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 40వేల128 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 22వేల 112 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 55 శాతంగా నమోదైంది. గత వారం బెంగళూరులో పాజిటివిటీ రేటు 12 శాతంగా ఉండగా.. అది ఒక్క వారంలోనే 55 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 3 లక్షలకుపైగానే యాక్టిక్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 44వేల 631 కరోనా కేసులు నమోదవగా, 288 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కర్నాటక సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.
అయితే.. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని.. అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: