AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Chairpersons: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ల ఎంపికపై టీఆర్ఎస్ గురి.. పార్టీ పరిశీలకుల నియామకం

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది.రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ సునాయసంగా గెలుచుకుంది. మేయర్లు, మున్సిపల్ ఎన్నికపై టీఆర్ఎస్ కసరత్తు.

Municipal Chairpersons: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ల ఎంపికపై టీఆర్ఎస్ గురి.. పార్టీ పరిశీలకుల నియామకం
Kcr
Balaraju Goud
|

Updated on: May 05, 2021 | 2:42 PM

Share

Municipal Chairpersons: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది.రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ సునాయసంగా గెలుచుకుంది. కాగా, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, సిద్దిపేట‌, అచ్చంపేట‌, జ‌డ్చర్ల, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ‌కు టీఆర్ఎస్ పార్టీ ప‌రిశీల‌కుల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల పేర్లను టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రక‌టించారు. ఈ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుఫున నియమించిన పరిశీలకులంతా గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని పార్టీ అధినేత ఆదేశించింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో పరిశీలకు సమావేశమవుతారు. ఆయా కార్పోరేషన్లకు మేయర్లును, డిప్యుటీ మేయర్లును , మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు క్రమశిక్షణతో ఎన్నుకోవాలని రాష్ట్ర పార్టీ సూచించింది. పార్టీ నిమయావళిని అనుసరించి ఎన్నికలు జరగాలని తెలిపింది.

వరంగల్ కార్పొరేష‌న్ ఎన్నికల పరిశీలకులు – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ ఖమ్మం కార్పొరేష‌న్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి కొత్తూరు మున్సిపాలిటీ – మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అచ్చంపేట మున్సిపాలిటీ – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నకిరేకల్ మున్సిపాలిటీ – టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు సిద్దిపేట మున్సిపాలిటీ – రవీందర్ సింగ్ (మాజీ మేయర్, కరీంనగర్), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్) జడ్చర్ల మున్సిపాలిటీ – మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్)

ఇక, స్థానిక నేతల అభిప్రాయంతో పార్టీ నేతలు ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి మేయర్‌ను ఎన్నుకోనున్నారు. పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల పరిశీలకులు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్ల‌ను, డిప్యూటీ మేయర్ల‌ను, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల‌ని సూచించారు.

Read Also… RBI Governor Shaktikanta Das: సామాన్యులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ.. కేవైసీ రూల్స్‌ సవరిస్తూ కీలక నిర్ణయం