Corona vaccine: 103 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వ్యాక్సిన్.. రికార్డుల్లోకెక్కిన బామ్మ.. ఎక్కడో తెలుసా.. ?
oldest person receives COVID-19 vaccine: రెండో విడుతలో భాగంగా మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్లు దాటిన వారికి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను
COVID-19 vaccine: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ముందుగా వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండో విడుతలో భాగంగా మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్లు దాటిన వారికి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వృద్ధులకు భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో కామేశ్వరి అనే 103 ఏళ్ల మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ మొదటి డోసును పంపిణీ చేసినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. అయితే.. కామేశ్వరి దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అత్యంత వయస్సున్న మహిళగా నిలిచిందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. మహాబీర్ ప్రసాద్ మహేశ్వరితో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురు సీనియర్ సిటిజన్లకు కూడా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు భారత్‌లో రికార్డవుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 16న దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య బుధవారం ఉదయం నాటికి 2,43,67,906 చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 13.5 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఓవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 టీకాను పంపిణీ చేస్తున్నారు.
Also Read: