“RSS”కి కరోనా దెబ్బ.. ఏమైందంటే..?

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో పెద్ద పెద్ద సమావేశాలు సైతం వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా దెబ్బ రాష్ట్రీయ స్వయం సేవక్‌పై పడింది. ఈ నెల 15 నుంచి 17 వరకు జరగాల్సిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని.. ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం […]

RSSకి కరోనా దెబ్బ.. ఏమైందంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 3:11 PM

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో పెద్ద పెద్ద సమావేశాలు సైతం వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా దెబ్బ రాష్ట్రీయ స్వయం సేవక్‌పై పడింది. ఈ నెల 15 నుంచి 17 వరకు జరగాల్సిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని.. ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 17 మధ్య.. బెంగళూరులో ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో అత్యున్నత నిర్ణాయక విభాగం అయిన ఏబీపీఎస్‌.. ప్రతియేట ఒకసారి సమావేశమవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో.. కేంద్ర, రాష్ట్రాల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తెలిపారు.