ఎస్ బ్యాంక్ విత్ డ్రాల్ లిమిట్.. మూడు రోజుల్లో లిఫ్ట్
ఎస్ బ్యాంక్ కస్టమర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాల్లోనుంచి వారు 50 వేల రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోరాదన్న ఆంక్షలను మరో మూడు రోజుల్లో ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
ఎస్ బ్యాంక్ కస్టమర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాల్లోనుంచి వారు 50 వేల రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోరాదన్న ఆంక్షలను మరో మూడు రోజుల్లో ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే వచ్ఛే బుధవారం నుంచి ఈ ఆంక్షలు తొలగనున్నాయి. ఈ బ్యాంకు సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంక్ దీనిపై ఈ నెలారంభంలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. బ్యాంక్ వినియోగదారులు ఏప్రిల్ 3 వరకు తమ ఖాతాలనుంచి యాభై వేలకు మించి విత్ డ్రా చేసుకోరాదని ఆ మధ్య ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్ బ్యాంకు ఫౌండర్ రానా కపూర్ నిర్వాకం ఫలితంగా దీని కోట్ల ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. కాగా- పాత బోర్డును ప్రభుత్వం రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. పైగా వేలాది మంది డిపాజిటర్లు ఎస్ బ్యాంక్ ముందు బారులు తీరారు. తమ రుణాలు, శాలరీల చెల్లింపుల విషయంలో తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని ప్రస్తుత కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఎస్ బ్యాంకును పునర్వ్యవవస్థీకరించడానికి ఉద్దేశించిన పథకాన్ని రిజర్వ్ బ్యాంకు ప్రకటించిందని, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఎస్ బీ ఐ.. ఎస్ బ్యాంకులో 49 శాతం పెట్టుబడులు పెడుతుందని, ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్వెస్టర్లను కూడా ఆహ్వానించామని ఆమె చెప్పారు. మారటోరియం ఎత్తివేసిన అనంతరం కొన్ని రోజుల తరువాత అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం ఖాళీ అవుతుందన్నారు.