Congress List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. తెలంగాణలో ఐదుగురికి చోటు..
పార్లమెంట్ ఎన్నికలకు మరో 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ కు అవకాశం కల్పించిన కాంగ్రెస్ హైకమాండ్.
పార్లమెంట్ ఎన్నికలకు మరో 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చేవెళ్ల నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి గాను మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
పెద్దపల్లి – గడ్డం వంశీ
సికింద్రాబాద్ – దానం నాగేందర్
మల్కాజిగిరి – సునీత మహేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – మల్లు రవి
చేవెళ్ల – గడ్డం రంజిత్ రెడ్డి
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు గానూ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 57 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల మూడవ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. ఇక బెంగళూరు నార్త్ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ రాజీవ్ గౌడ, గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత అమిత్ చావ్డా గుజరాత్ ఆనంద్ నుంచి బరిలోకి దిగనున్న కీలక అభ్యర్థుల్లో ఉన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నాలుగు రాష్ట్రాల నుంచి సిట్టింగ్ లోక్ సభ ఎంపీ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ రాష్ట్రంలోని జోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప్రస్తుతం కుటుంబానికి కంచుకోటగా భావించే చింద్వారా నుండి పోటీ చేయనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ జలోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 57 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों के नाम की तीसरी लिस्ट जारी की गई। pic.twitter.com/7TMkx4faZ4
— Congress (@INCIndia) March 21, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…