CONGRESS PARTY: సంస్థాగత మార్పులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. భారీ మార్పులకు రెడీ అవుతున్న రాహుల్

దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించి.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఉనికి కూడా లేని స్థితికి దిగజారిన జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులకు రెడీ అవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని…

CONGRESS PARTY: సంస్థాగత మార్పులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. భారీ మార్పులకు రెడీ అవుతున్న రాహుల్
Sonia Gandhi,rahul Gandhi,priyanka Gandhi
Follow us
Rajesh Sharma

|

Updated on: Jun 01, 2021 | 5:33 PM

CONGRESS PARTY GEARING UP FOR INTERNAL CHANGES: దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించి.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఉనికి కూడా లేని స్థితికి దిగజారిన జాతీయ కాంగ్రెస్ పార్టీ (INDIAN NATIONAL CONGRESS) సంస్థాగత మార్పులకు రెడీ అవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని విజయం దిశగా నడిపించే నాయకత్వాల కోసం చూస్తోంది. గెలుపు గుర్రాలను అన్వేషించి.. వారికి పార్టీ పగ్గాలను అప్పటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం (CORONA HIGH COMMAND) చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ (AICC) నుంచి పీసీసీల వరకు భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు పార్టీ అధిష్టానం సంకేతాల్నిస్తోంది. ముఖ్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకుని, దూకుడుగా రాజకీయాలు నెరిపే సామర్థ్యం వున్న యువ నాయకత్వాలకు పెద్ద పీట వేయాలని రాహుల్ గాంధీ (RAHUL GANDHI) భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఏఐసీసీ కమిటీలోని ఖాళీలతోపాటు పలు పీసీసీ (PCC)లకు కొత్త నాయకత్వాలను నియమించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. తెలంగాణ (TELANGANA) వంటి రాష్ట్రాలకు చాలా కాలంగా పీసీసీ అధ్యక్షుడే లేరు. పలు ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ (TPCC) అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించి నెలలు గడుస్తోంది. అయితే.. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో ఆయనే ఉండీ.. ఉండనట్లుగా పీసీసీ ఇంఛార్జిగా బాధ్యతలు నెరుపుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక (NAGARJUN SAGAR BY-ELECTION) వచ్చినా తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణతోపాటు కేరళ పీసీసీ అధ్యక్షుడిని కూడా వెంటనే నియమించనున్నట్లు తెలుస్తోంది.

కేరళ (KERALA) పీసీసీ రేసులో కే.సుధాకరన్, కొడిక్కుణ్ణిల్ సురేశ్, పీటీ థామస్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో సుధాకరన్, సురేశ్‌లిద్దరు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిలో సుధాకరన్ వయస్సు 73 ఏళ్ళు. సురేశ్ వయస్సు 58 ఏళ్ళు.. అధిష్టానం 71 ఏళ్ళ పీటీ థామస్ వైపు మొగ్గుచూపుతున్నట్లుగా సంకేతాలున్నాయి. కానీ.. ‘‘ కాల్ సుధాకరన్, సేవ్ కాంగ్రెస్’’ అనే నినాదంతో సుధాకరన్ నాయకత్వమే పార్టీకి అవసరమంటూ శ్రేణులు పెద్ద ఎత్తున అధిష్టానానికి ఈమెయిల్స్ పంపుతున్నారు. పెద్ద వయస్కుడైనా సుధాకరన్ తీసుకునే నిర్ణయాలు, దూకుడు రాజకీయాలే కేరళలో కాంగ్రెస్ పార్టీకి అవసరమన్నది ఈమెయిల్స్ సారాంశం. పినరయి విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ రెండోసారి కేరళలో ఇటీవలనే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం పదేళ్ళ తర్వాతైన అధికారం రావాలంటే సుధాకరన్ నేతృత్వం అవసరమని పార్టీ వర్గాలంటున్నాయి.

ఇక తెలంగాణ పీసీసీ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఉత్తమ్ రాజీనామా తర్వాత పలువురు ఢిల్లీ వెళ్ళి తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ అధిష్టానం ఇపుడపుడే నిర్ణయం తీసుకునేలా కనిపించకపోవడంతో సమయం వచ్చినపుడు చూసుకుందామనుకుని సైలెంటయిపోయారు. తాజాగా అధిష్టానం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తుండడంతో తెలంగాణ పీసీసీ ఆశావహులు మళ్ళీ హస్తిన బాట పడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తనదైన శైలిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతల పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

మరోవైపు ఏఐసీసీలోనూ భారీగా మార్పులకు హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏఐసీసీలోని ఖాళీలను భర్తీ చేయడంతో రాహుల్, ప్రియాంకల మార్కు వుండేలా ప్లాన్ జరుగుతున్నట్లు హస్తిన వర్గాలంటున్నాయి. సంస్థాగత ఎన్నికల ద్వారా ఏఐసీసీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరు విఙ్ఞప్తి చేసినా ఆయన అధ్యక్ష స్థానంలోకి తిరిగి రాలేదు. దాంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీనే నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ అనారోగ్యం దృష్ట్యా రాహుల్ గాంధీ త్వరలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను రెండో దఫా చేపడతారని ప్రచారం జరుగుతోంది.

ALSO READ: కేంద్రంపై ముఖ్యమంత్రుల యుద్ధం.. తెరమీదికి విజయన్, హేమంత్ సోరేన్

ALSO READ: కరోనా రావడమే మంచిదట.. ఓసారి సోకి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇక రక్షణే రక్షణ

బెంగళూరు కెప్టెన్‌ మెటీరియల్స్ వీళ్లే.. లిస్ట్‌లో ఐదుగురు
బెంగళూరు కెప్టెన్‌ మెటీరియల్స్ వీళ్లే.. లిస్ట్‌లో ఐదుగురు
చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
వందే భారత్ రైలు భోజనంలో కీటకాలు.. స్పందించిన రైల్వే శాఖ.. రూ.50లు
వందే భారత్ రైలు భోజనంలో కీటకాలు.. స్పందించిన రైల్వే శాఖ.. రూ.50లు
ఆ ప్లేయర్‌ని తీసుకుంటే ఇక ఏ ఢోకా ఉండదు.. ఆర్సీబీకి ఏబీడీ సలహా
ఆ ప్లేయర్‌ని తీసుకుంటే ఇక ఏ ఢోకా ఉండదు.. ఆర్సీబీకి ఏబీడీ సలహా
చలికాలంలో తేనె తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
చలికాలంలో తేనె తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
'బుమ్రాకు అంత సీన్ లేదు.. నన్ను ఔట్ చేయడం ఇంపాజిబుల్'
'బుమ్రాకు అంత సీన్ లేదు.. నన్ను ఔట్ చేయడం ఇంపాజిబుల్'
బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఈపదార్థం తప్పక చేర్చండి.ఆరోగ్య ప్రయోజనాలు
బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఈపదార్థం తప్పక చేర్చండి.ఆరోగ్య ప్రయోజనాలు
బిగ్ అలెర్ట్.. మీ పాన్‌ కార్డ్‌ తో ఆధార్‌ లింక్‌ అయి ఉందా ??
బిగ్ అలెర్ట్.. మీ పాన్‌ కార్డ్‌ తో ఆధార్‌ లింక్‌ అయి ఉందా ??
హైవేపై అఘోరీ వీర విహారం.. తాళ్లతో బంధించిన పోలీసులు...
హైవేపై అఘోరీ వీర విహారం.. తాళ్లతో బంధించిన పోలీసులు...
ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??
ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??