Ram Janma Bhoomi: అయోధ్యలో రామ జన్మభూమి వద్ద వేగంగా సాగుతున్న రామాలయ పునాది నిర్మాణం పనులు..
Ram Janma Bhoomi: అయోధ్యలో రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం పునాది కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్నారు.
Ram Janma Bhoomi: అయోధ్యలో రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం పునాది కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఇక్కడ పునాది పనుల నిర్వహణకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. రామాలయం కోసం వేసే పునాది మొత్తం 44 లేయర్లుగా ఉంటుంది. దీనిలో ఇప్పటివరకూ 6 పొరలు నిర్మాణం పూర్తి అయింది. వరుస తుపానుల కారణంగా కొన్నిరోజులుగా ఆగిపోయిన రామాలయ నిర్మాణ పనులు సోమవారం నుంచి మళ్ళీ ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ రామాలయ పునాది పనులు వచ్చే ఆగస్టు నెలకల్లా పూర్తవుతాయని చెప్పారు.
మొత్తం పునాది 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేస్తున్నారు. 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఈ ఫౌండేషన్ నిర్మాణం జరుగుతోందని చంపత్ రాయ్ తెలిపారు. మొత్తం 44 పొరలుగా ఈ ఫౌండేషన్ వేస్తరన్నారు. ఒక్కో పోరా 12 అంగుళాల మందంతో వేస్తారు. ప్రతి పోరా రోలింగ్ చేస్తారు. దీంతో ఒక్కో పోరా 2 నుంచి 10 అంగుళాల వరకూ కిందకు నొక్కబడుతుంది.
సముద్ర మట్టానికి 105 మీటర్ల ఎత్తులో ఉన్న భూమిపై ప్రధాని నరేంద్ర మోడీ పూజలు చేశారు. ఇప్పుడు ఈ భూమి నుండి శిధిలాలు తొలగించారు. లెవలింగ్ తరువాత, ఈ భూమి ఇప్పుడు సముద్ర మట్టానికి 93 మీటర్ల ఎత్తులో ఉంది. అని చంపత్ రాయ్ తెలిపారు. భక్తులు పునాది నుండి మట్టిని ప్రసాద్ గా తీసుకుంటున్నారు. అయోధ్యలోని రామ్ ఆలయ పునాది తవ్వకం నుండి వచ్చిన మట్టిని రామ్ ఆలయ వారసత్వంగా తీసుకొని వెళుతున్నారు భక్తులు. దీనిని ఇంటింటికీ పంపించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. కరోనా కారణంగా భక్తులు అక్కడకు వచ్చి మట్టిని తీసుకువెళ్ళే విధానం మూసివేశారు. ఈ మట్టిని కర్సేవక్ పురంలో ఉంచారు. ఆలయ నిర్మాణం నుండి వచ్చే మట్టిని కర్సేవక్ పురంలో ఉంచారని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా చెప్పారు.
Also Read: నోయిడా వ్యక్తికి వింత అనుభవం… కొవిడ్ టీకా వేసుకోకుండానే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్..ఎలా సాధ్యం?
Sai Pallavi: ‘సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’… చాలానే సాధించింది.. అంతకంటే ఎక్కువే పోగొట్టుకుంది