Sai Pallavi: ‘సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’… చాలానే సాధించింది.. అంతకంటే ఎక్కువే పోగొట్టుకుంది
సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ... అని కళ్లెరగేస్తున్నారు హీరోయిన్ సాయిపల్లవి. ఆరేళ్లయింది సరే.. ఈ ఆరేళ్లలో ఏం సాధించావమ్మా అంటే.. చాలానే వుంది అనే ఆన్సర్ కూడా వుందక్కడ.
సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ… అని కళ్లెరగేస్తున్నారు హీరోయిన్ సాయిపల్లవి. ఆరేళ్లయింది సరే.. ఈ ఆరేళ్లలో ఏం సాధించావమ్మా అంటే.. చాలానే వుంది అనే ఆన్సర్ కూడా వుందక్కడ. కానీ.. ఈ ఆరేళ్లలో పోగొట్టుకున్నది కూడా తక్కువేం కాదట. ఇంతకీ ఏం పోగొట్టుకున్నారామె? తెలుసుకుందాం పదండి. సాయిపల్లవి ఫస్ట్ మూవీ ప్రేమమ్ రిలీజై సిక్స్ ఇయర్స్ కంప్లీటైంది. ఆమె అనుకుంటే ఈపాటికే టాప్ చెయిర్ దక్కేదన్నది ఒక లెక్క! టాలీవుడ్‌లో సాయిపల్లవి క్రేజ్ ఆ రేంజ్‌లో వుందిప్పుడు. కాకపోతే.. ఇక్కడో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె కెరీర్‌లో ఒప్పుకున్న సినిమాల కంటే.. రిజెక్ట్ చేసిన సినిమాలే ఎక్కువ. అందుకే.. ఈ ఆరేళ్లలో పట్టుమని పది సినిమాల్లోనే కనిపించారు ఈ క్యూట్ గాళ్. ఒక్కోసినిమాకు 60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్న సాయిపల్లవి.. ఈ మూడేళ్లలోనే నాలుగు బిగ్ ఛాన్సెస్‌ని వద్దనుకున్నారు. ఆర్టిఫిషియల్ బ్యూటీ ప్రాడక్ట్స్‌ని ప్రమోట్ చేసే ప్రసక్తే లేదని ఒట్టేసుకున్నారు కనుక… మరికొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా ఆమెకు దూరంగా వెళ్లిపోయాయి. సో.. రౌడీ బేబీ రెవిన్యూ లోంచి ఐదు కోట్ల దాకా కోత పడినట్టేగా?.
డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవే అనేది ఒక న్యూస్. ఇప్పుడు అయ్యప్పనుం ఖోషియుమ్ రీమేక్‌లో పవన్‌కి జోడీగా నటించే గోల్డెన్ ఛాన్స్‌ని ఆమె రిజెక్ట్ చేశారట. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బెల్లంకొండ హీరో కూడా బిగ్ ఎమౌంట్ ఆఫర్ చేస్తే.. నో థ్యాంక్స్ అన్నారట ఫిదా బ్యూటీ. సో.. వీటన్నిటికీ సంతకం పెట్టి కాల్షీట్స్ ఇచ్చేస్తే.. సాయిపల్లవి ఎంత హైట్‌లో నిలబడేవారో కదా..!
Also Read: గతంలో ఎన్నడూ ఎరుగని సిట్యూవేషన్.. ఇస్మార్ట్ డైరెక్టర్, ఏంటి మేటర్