Rajamouli RRR: అక్కడ ఉంది జక్కన్న.. తగ్గేదే లే.. ప్రమోషన్‌లో కూడా తన మార్క్
బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వచ్చే మూవీ బాహుబలి కంటే మించి వుండొచ్చన్న అంచనాలే... ట్రిపులార్‌కి మెయిన్ డ్రైవింగ్ ఫోర్సెస్. కానీ...
బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వచ్చే మూవీ బాహుబలి కంటే మించి వుండొచ్చన్న అంచనాలే… ట్రిపులార్‌కి మెయిన్ డ్రైవింగ్ ఫోర్సెస్. కానీ… ఆ సినిమాకుండే రెడీమేడ్ హైప్ అప్పుడప్పుడూ తగ్గుతోందనే బెంగ.. దర్శకధీరుడ్ని ఎలర్ట్ చేస్తోంది. అందుకే.. ఓ ఖతర్నాక్ ఫార్ములాను రెడీ చేసుకున్నారట. జక్కన్న తీస్తున్న మరో కళాఖండంగా ట్రిపులార్ మూవీకి ఎప్పుడూ బజ్ వుండనే వుంది. కొన్ని కారణాల వల్ల ఆ బజ్ ఒక్కోసారి తగ్గుతోంది. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఫలానా రేటుకు అమ్మేశామన్న వార్తతో నిన్నటిదాకా హల్‌చల్ చేశారు. రిలీజ్ డేట్‌పై వస్తున్న రూమర్ల మీద ఎటూ తేల్చుకోలేకపోతోంది ట్రిపులార్ టీమ్. సరిగ్గా ఇక్కడే కథకుడు విజయేంద్ర ప్రసాద్ సీన్లోకొచ్చేశారు.
కొమరంభీమ్ క్యారెక్టర్‌లో తారక్ కంటతడి పెట్టిస్తారంటూ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్.. ట్రిపులార్ కంటెంట్ మీద హోప్స్ పెంచేసింది. తాజాగా.. ఆలియా భట్ చేస్తున్న సీత పాత్ర ఒక స్వీట్ సర్‌ప్రైజ్ అన్నారు విజయేంద్ర. కళ్లు తిప్పుకోలేనంత అందంగా డిజైన్ చేశారు ఆలియా రోల్‌ని అంటూ ఆయనిచ్చిన స్టేట్‌మెంట్.. మగధీర ఫ్యాన్స్‌ని తియ్యగా తాకేసింది. గత ఏడాది లాక్‌డౌన్ టైమ్‌లో డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ ఇచ్చిన లీక్స్.. ట్రిపులార్‌ని టాప్‌లో ట్రెండయ్యేలా చేశాయి. కథలో కొన్ని కీలక ఎపిసోడ్స్‌ని ప్రస్తావించారు సాయిమాధవ్. ఇలా అప్డేట్స్ ఇవ్వడం లేటైన ప్రతిసారీ కొన్ని ‘క్యారెక్టర్ల’ను మీడియాలో ప్రవేశపెడతారు జక్కన్న. తన సినిమాకు ఈవిధంగా సౌండ్ పెంచడం జక్కన్న ప్లే చేసే పవర్‌ఫుల్ జిమ్మిక్. సినిమా ప్రమోషన్‌లో చెయ్యి తిరిగిన దర్శకధీరుడి స్టయిలే అంత అంటున్నారు సినిమా జనాలు.
Also Read:‘సిక్స్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’… చాలానే సాధించింది.. అంతకంటే ఎక్కువే పోగొట్టుకుంది