GOODNEWS ON COVID: కరోనా రావడమే మంచిదట.. ఓసారి సోకి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇక రక్షణే రక్షణ

కరోనా సోకడం ఓకందుకు మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఓసారి కరోనా సోకి.. ఆ తర్వాత నిర్ణీత గడువు తీరాక వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా వైరస్ నుంచి పూర్తికాల రక్షణ వుంటుందని తాజాగా...

GOODNEWS ON COVID: కరోనా రావడమే మంచిదట.. ఓసారి సోకి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇక రక్షణే రక్షణ
Corona Virus.
Follow us
Rajesh Sharma

|

Updated on: Jun 01, 2021 | 5:48 PM

GOODNEWS ON COVID FROM SENIOR SCIENTISTS: కరోనా సోకడం ఓకందుకు మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఓసారి కరోనా సోకి.. ఆ తర్వాత నిర్ణీత గడువు తీరాక వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా వైరస్ నుంచి పూర్తికాల రక్షణ వుంటుందని తాజాగా సైంటిస్టుల బ‌ృందం అభిప్రాయపడింది. కరోనా వైరస్ కట్టడిపై తాజాగా రెండు పరిశోధనల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సరికొత్త ఆశలను రేకెత్తించాయి. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారు నిర్ణీత కాలం తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ నుంచి జీవిత కాల రక్షణ లభిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఒకవేళ వారికి మరోసారి కరోనా సోకినా కూడా ప్రాణాపాయం వుండదని వారంటున్నారు. కానీ వైరస్ సోకే అవకాశాలు మాత్రం దాదాపు లేవని చెబుతున్నారు.

కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయని చెప్పారు. కరోనా రీఇన్‌ఫెక్షన్లు శాస్త్రవేత్తలు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో ఉత్పత్తయ్యే నిర్దిష్ట యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయా అన్న ప్రశ్నలు వీటివల్ల ఉత్పన్నమయ్యాయి. ఈ వ్యాధి నివారణకు ఏటా లేదా ఆరు నెలలకోసారి టీకా పొందాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజా అధ్యయనాలు మాత్రం.. ఈ రోగనిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొన్నాయి. కొందరిలో ఇది కొన్ని దశాబ్దాలు కూడా కొనసాగొచ్చని తెలిపాయి. కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జ పాత్ర కీలకమని తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక అంటున్నారు. రెండు అధ్యయనాల్లోనూ శాస్త్రవేత్తలు.. ఎముక మజ్జలోని రోగనిరోధక కణాలను పరిశీలించారు.

కరోనాను గుర్తుపెట్టుకొని, భవిష్యత్‌లో అది దాడికి ప్రయత్నిస్తే వెంటనే తిప్పికొట్టే ‘టి కణాల’నూ రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని కూడా తేలడం ఊరట కలిగించే అంశం. కరోనా వైరస్‌లోని కొంత భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ తనలో భద్రపరచుకుంటుందని, దాని ఆధారంగా రోగ నిరోధక కణాలు ఈ వైరస్‌పై పోరులో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జ ప్రమేయం ఉండటం వల్ల.. కరోనాలో కొత్త రకాలనూ ఎదుర్కొనే సామర్థ్యం కూడా శరీరానికి లభిస్తుందని సైంటిస్టుల బృందం చెబుతోంది. వ్యాక్సిన్ పొందిన వారితో పోలిస్తే కరోనా నుంచి కోలుకున్నవారికి భవిష్యత్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే సమర్థత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకొని, ఆ తర్వాత వ్యాక్సిన్ పొందిన వారిలో రోగనిరోధక స్పందన మరింత మెరుగ్గా ఉంటుందని వివరించారు. వారికి బూస్టర్‌ వ్యాక్సిన్ల అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ALSO READ: కేంద్రంపై ముఖ్యమంత్రుల యుద్ధం.. తెరమీదికి విజయన్, హేమంత్ సోరేన్