AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌స్తాన్‌నే కాదు.. కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్న ఎంపీ శశిథరూర్‌..!

నరేందర్‌.. సరెండర్‌ అయ్యారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు శశిథరూర్‌ నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఆయుధంగా మారింది. పాక్‌తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయం లేదన్న థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయి. అమెరికా పర్యటనలో పాక్‌ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశిథరూర్‌.

పాక్‌స్తాన్‌నే కాదు.. కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్న ఎంపీ శశిథరూర్‌..!
Congress Mp Sheshitharoor
Balaraju Goud
|

Updated on: Jun 05, 2025 | 10:09 PM

Share

నరేందర్‌.. సరెండర్‌ అయ్యారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు శశిథరూర్‌ నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఆయుధంగా మారింది. పాక్‌తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయం లేదన్న థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయి. అమెరికా పర్యటనలో పాక్‌ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశిథరూర్‌.

ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వివరించడంలో కేంద్రం పంపించిన అఖిలపక్షం బృందాలు సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలో వెళ్లిన బృందం పాకిస్తాన్‌ను చీల్చి చెండాడంలో విజయవంతమవుతోంది. శశిథరూర్‌ను బృందానికి లీడర్‌గా నియమించి మోదీ సర్కార్‌ రెండు లక్ష్యాలను సాధిస్తోంది. ఓవైపు పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టడమే కాదు.. కాంగ్రెస్‌కు కూడా చుక్కలు చూపిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది శశిథరూర్‌ బృందం.. అమెరికా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు శశిథరూర్‌. డొనాల్డ్ ట్రంప్‌ ఫోన్‌లో బెదిరించడంతోనే భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దీంతో ఆయన రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టినట్టుగా భావించాల్సి వస్తోంది. ఆపరేషన్‌ సింధూర్‌పై కాంగ్రెస్‌ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు థరూర్‌ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తుంటే, థరూర్‌ మాత్రం మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీకి కొండంత బలాన్ని ఇస్తోంది.

పాకిస్తాన్‌తో యుద్దాన్ని కోరుకోవడం లేదని, కాని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోనే ఆపరేషన్‌ సింధూర్‌ను విజయవంతంగా నిర్వహించామని అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్‌ వివరించారు. భారత్ పరిస్థితి ఏమిటన్నది అమెరికాకు క్లియర్‌కట్‌గా అర్థమైందన్నారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని.. కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు.‘‘పాకిస్తాన్‌తో మేము యుద్దాన్ని కోరుకోవడం లేదు.. పౌక్‌ పౌరులపై మాకు దాడి చేసే ఉద్దేశ్యం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పంచడంతోనే వాళ్ల స్థావరాలపై మేము దాడి చేశాం. ఉగ్రవాద శిబిరాలను ఎందుకు మూసేయడం లేదు. టెర్రర్‌ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు. మీరు దీనికి సిద్దంగా లేనందునే విధి లేని పరిస్థితుల్లో దాడులు చేశామని’’ థరూర్ అన్నారు.

ఐదు దేశాల్లో శశిథరూర్‌ బృందం పర్యటిస్తోంది. గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో ఆపరేషన్‌ సింధూర్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. కొలంబియా తొలుత పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించింది. భారత్‌ దాడిలో పాక్‌లో చిన్న పిల్లలు చనిపోయారని, వాళ్లకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించింది. కాని శశిథరూర్‌ పర్యటన తరువాత కొలంబియా తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..