ఢిల్లీ అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ !

ఢిల్లీ అల్లర్ల కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేరును పోలీసులు తమ 17 వేల పేజీల సుదీర్ఘ చార్జిషీట్ లో పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని..

  • Umakanth Rao
  • Publish Date - 12:07 pm, Thu, 24 September 20
ఢిల్లీ అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ !

ఢిల్లీ అల్లర్ల కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేరును పోలీసులు తమ 17 వేల పేజీల సుదీర్ఘ చార్జిషీట్ లో పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఈ చార్జిషీట్ లో అభియోగం మోపారు. ఉమర్ ఖాలిద్, సల్మాన్ ఖుర్షీద్, నదీమ్ ఖాన్ అనే ముగ్గురు ఇలా ఉద్రేక పూరిత ప్రసంగాలు చేశారని కొందరు సాక్షులు వాంగ్మూలమిచ్చారని పోలీసులు తెలిపారు. సాక్షాత్తూ మేజిస్ట్రేట్ ఎదుటే వారీ ప్రకటన చేశారని, కానీ వారి పేర్లను బయట పెట్టబోమని ఢిల్లీ ఖాకీలు అంటున్నారు. వీరి విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. కాగా తాను రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేశానన్న ఆరోపణపై సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ, ఇదంతా ‘చెత్త’ (రబ్బిష్) వ్యవహారమని కొట్టి పారేశారు. ఎవరో వ్యక్తులు ఈ విధమైన వాంగ్మూలం ఇస్తే అది నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు. అసలు రెచ్ఛగొట్టే ప్రసంగం అంటే ఏమిటన్నారు.

అటు-సీపీఎం లీడర్ బృందా కారత్, లాయర్ ప్రశాంత్ భూషణ్, యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్ పేర్లను కూడా పోలీసులు తమ చార్జిషీట్ లో పేర్కొన్నారు.